పుట్టబోయే పిల్లల గురించి రష్మిక మందన్న పక్కా ప్లానింగ్, వారికోసం ఏం చేయబోతుందంటే?

Published : Oct 29, 2025, 01:46 PM IST

పుట్టబోయే పిల్లల గురించి ఇప్పుడే గట్టిగాప్లాన్ చేస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. రీసెంట్ గా విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ బ్యూటీ.. తనకు పుట్టబోయే పిల్లల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

PREV
14
విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్

పాన్ ఇండియా హీరోయిన్ అయినప్పటి నుంచి ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్న. వరుసగా సక్సెస్ లు చూస్తూ వస్తోన్న ఈ బ్యూటీ.. ఇటు టాలీవుడ్ లో.. అటు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోంది. అంతే కాదు త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతోంది రష్మిక మందన్న. రీసెంట్ గా తన ప్రియుడు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో సీక్రే్ట గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది రష్మిక. ఇక వీరి పెళ్లి డేట్ పై అఫీషియల్ గా ఇంత వరకూ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఈక్రమంలో రష్మిక మందన్న తనకు పుట్టబోయే పిల్లల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

24
వరుసగా హిట్లు కొడుతోన్న రష్మిక

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం తన కొత్త సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రమోషన్లలో బిజీగా ఉంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, ధీరజ్ మొగిలినేని నిర్మాతగా ఉన్నారు. ప్రమోషన్ ఈ వెంట్స్ ను సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు టీమ్. ఈసందర్భంగా ఓ కార్యక్రమంలో రష్మిక మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

34
8 గంటల షిఫ్ట్ కావాలంటున్న హీరోయిన్

సినిమాల్లో పనిచేసే నటీనటుల ఒత్తిడి, ఆరోగ్యం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్, అలాగే తన భవిష్యత్తు ప్రణాళికల గురించి రష్మిక ఓపెన్ కామెంట్స్ చేశారు. “ నటీనటులకు కూడా ఆఫీస్ ఉద్యోగుల్లా 9 నుంచి 5 వరకూ పనివేళలు ఉండాలి, ఓవర్‌వర్క్‌ చేయడం గొప్ప విషయం కాదు. మన శరీరం, మనసు విశ్రాంతి కోరుకుంటాయి. రోజుకు 8-10 గంటల నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. నేను కూడా నా కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నాను, సరిగ్గా నిద్రపోవాలనుకుంటున్నాను” అని ఆమె అన్నారు.ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.

44
పిల్లల గురించి ఇప్పటి నుంచే ప్లానింగ్

ఇక ఈ సందర్భంగా రష్మిక తన లైఫ్ ప్లానింగ్ గురించి కూడా మాట్లాడింది. ఈ విషయంలో ఎమోషనల్ కామెంట్స్ చేసింది నేషనల్ క్రష్. “నేను ఇంకా తల్లిని కాలేదు. కానీ భవిష్యత్తులో నాకు పిల్లలు పుడతారని తెలుసు. వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. వారి కోసం నేను శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలి. అందుకే ఇప్పటి నుంచే ఆ దిశగా ఆలోచిస్తున్నాను. 20 నుండి 30 ఏళ్ల మధ్య కష్టపడాలి. 30 నుండి 40 మధ్య వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించాలి. 40 తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం ''అని రష్మిక మందన్న అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories