నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పటికీ అదే క్రేజ్‌ని కొనసాగిస్తుంది. ఎంతో మంది హీరోయిన్లు వచ్చీపోతున్నా, తన మాత్రం చాలా స్టెబుల్‌గా ఉంది. ప్రస్తుతం పలు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల `యానిమల్` చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ ఏడాది మరో సంచనలనానికి రెడీ అవుతుంది.
ఈ క్రమంలో రష్మిక మందన్నా తన మనసులో మాటని, చిన్నప్పుడు నాన్న చెప్పిన మాటని బయటపెట్టింది. డ్రీమ్ హీరోయిన్‌ని గుర్తు చేసుకుంది. నాన్న మాటని గుర్తు చేసుకుంది. చిన్నప్పుడు తన నాన్న తనని సౌందర్యలా ఉంటావని కితాబిచ్చేవాడట. సహజమైన అందాల తార సౌందర్యతో తనని పోల్చేవారని చెప్పింది రష్మిక మందన్నా. తనని అలా చూడాలని ఉందనే మనసులో మాటని కూడా తండ్రి బయటపెట్టారని తెలిపింది.
ఇటీవల రష్మిక ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడింది. పలు క్రేజీ విషయాలను తెలిపింది. తన ఫేవరేజ్ హీరోయిన్ ఎవరో కూడా చెప్పింది. తనకు సౌందర్య అంటే ఇష్టమని వెల్లడించింది. ఆమెలా మంచి నటిగా పేరు తెచ్చుకోవాలనుకుంటుందట. అంతేకాదు సౌందర్య బయోపిక్‌లో ఆమె పాత్రలో తాను నటించాలని ఉందట. భవిష్యత్‌లో ఆ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నట్టు తెలిపింది రష్మిక. చిన్న ప్పుడు తన నాన్న చెప్పిన మాటని నిజం చేసి చూపించాలని భావిస్తున్నట్టు తెలిపింది రష్మిక.
దీంతోపాటు `యానిమల్` మూవీ రొమాన్స్ సీన్లు, లిప్ లాక్‌లతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఆ సీన్లు చేసేటప్పుడు దర్శకుడు తనని సొంత భార్యలా ఫీల్ అయి చేయాలన్నాడట. అయితే ఆ సీన్లు బాగా ఇన్‌వాల్వ్ అయి చేశానని,ఒకానొక దశలో తనని తాను మర్చిపోయానని, మైండ్ బ్లాంక్ అయ్యిందని, ఆ సీన్‌లోని ఎమోషన్‌తో ట్రావెల్ అవుతూ సీన్ అయిపోయాక కూడా ఏడుస్తూ ఉండిపోయేదాన్ని అని వెల్లడించింది రష్మిక. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ వైరల్ అవుతుంది.
ఇక రష్మిక మందన్నా ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లవ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై విజయ్ స్పందించి, తాను ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవడం లేదని, ఎంగేజ్‌మెంట్ అనే వార్తల్లో నిజం లేదన్నారు. మీడియానే తనకు పెళ్లి చేయాలని ఉవ్విళ్లూరుతున్నారని సెటైర్లు వేశారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం `పుష్ప2`లో శ్రీవల్లిగా సందడి చేసేందుకు వస్తుంది. ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న విడుదల కానుంది. దీంతోపాటు కొత్తగా ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యింది. మరోవైపు `ది గర్ల్ ఫ్రెండ్`, `రెయిన్ బో` చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.