Rashmika without Makeup: మేకప్‌ లేకుండా షాకిస్తున్న రష్మిక.. డేరింగ్‌ లో నేషనల్‌ క్రష్‌ తర్వాతే ఎవరైనా?

First Published | Mar 18, 2022, 8:01 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఎనర్జిటిక్‌. కొంటెతనం, చలాకీతనం కలగలిపిన ఈ బ్యూటీ ఇటీవల గ్లామర్‌ డోస్‌ పెంచుతూ కుర్రాళ్లకి బేజారెత్తిస్తుంది. తాజాగా మేకప్‌ లేకుండా దిగిన ఫోటోలు పంచుకుని షాకిస్తుంది. 

రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్‌గా మారిన అతి తక్కువ టైమ్‌లోనే నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ని పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇటీవల `పుష్ప` చిత్రంతో ఏకంగా పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారింది. తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో దూసుకుపోతుందీ బ్యూటీ. 
 

రష్మిక ఇటీవల క్రమ క్రమంగా గ్లామర్‌గా ఓపెన్‌ అవుతుంది. అభిమానులకు షాకిస్తుంది. తాజాగా మేకప్‌ లేకుండా ఫోటోలను పంచుకుని మరింత షాక్‌కి గురి చేస్తుంది. నేడు(శుక్రవారం) హోళీ పండుగ సందర్భంగా తన ఫోటోలను పంచుకుంది రష్మిక మందన్నా. తన అమ్మతో వీడియో చాట్‌ పిక్స్ ని అభిమానులతో షేర్‌ చేసింది. ఇందులో ఆమె మేకప్‌ లేకుండా కనిపించడం విశేషం. 


మేకప్‌ లేకుండా తన లేటెస్ట్ లుక్‌ని డేరింగ్‌గా పంచుకుని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇందులో రష్మిక మేకప్‌ లేకపోయినా అందంగానే ఉండటం విశేషం. క్యూట్‌నెస్‌ మరింత ఓవర్‌లోడ్‌ అయ్యిందని చెప్పొచ్చు. మరే హీరోయిన్‌ కూడా ఇలా మేకప్‌ లేకుండా ఫోటోలను పంచుకునే ధైర్యం చేయరు. కానీ రష్మిక ఈ విషయంలో ముందే ఉంటుంది.
 

జనరల్‌గా రష్మిక మేకప్‌ని ఇష్టపడదు. సహజంగా కనిపించేందుకే ఇష్టపడుతుంది. పైగా మేకప్‌ వేస్తే స్కిన్‌ ఎలర్జీ కూడా వస్తుందని గతంలో చెప్పింది. అయినా సినిమాల కోసం మేకప్‌ వేసుకోవడం తప్పడం లేదు. తెరపై అందంగా, ప్లజెంట్‌గా కనిపించాలంటే మేకప్‌ తప్పనిసరి. దీంతో ఇష్టం లేకపోయినా మేకప్‌ వేసుకుంటుంది. 

అయితే చాలా మంది కథానాయికలను మేకప్‌ లేకపోతే చూడటం కష్టం. గుర్తుపట్టలేనంతగా ఉంటారు. కానీ ఈ విషయంలో రష్మిక బెటర్‌ అని చెప్పొచ్చు. ఆమె మేకప్‌ లేకపోయినా అంతే అందంగా ఉండటం విశేషం. అందుకే ఈ బ్యూటీ అభిమానులను ఏ రూపంలోనైనా అలరిస్తుంది. తన వెంటపడేలా చేసుకుంటుంది. 
 

సౌత్‌ హీరోయిన్లలో అత్యధిక సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ కలిగిన నటిగా రష్మిక నిలిచింది. ఆమెని జస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఏకంగా 30 మిలియన్ల నెటిజన్లు ఫాలో అవుతుండటం విశేషం. అతితక్కువ సమయంలోనే ఇంతటి ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్న నటిగా రష్మిక రికార్డ్ సృష్టిస్తుంది. సౌత్‌లో టాప్‌లో నిలిచింది. 

ఇక ఇటీవల `పుష్ప`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాలతో ఆకట్టుకుంది నేషనల్‌ క్రష్‌ రష్మిక. ప్రస్తుతం తెలుగులో `పుష్ప 2`లో నటిస్తుంది. మరోవైపు రామ్‌తో బోయపాటి చిత్రంలో నటించబోతుందట. అలాగే తమిళంలో విజయ్‌తో వంశీపైడిపల్లి సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందని టాక్‌. దీంతోపాటు రామ్‌చరణ్‌, గౌతమ్‌ తిన్ననూరి సినిమాలోనూ రష్మిక పేరు వినిపిస్తుంది. మరోవైపు హిందీలో రెండు సినిమాలు చేస్తుంది రష్మిక. 

Latest Videos

click me!