కంగనా బాటలోనే తాప్సీ, కృతి సనన్, పురుషాధిపత్యంపై గళమెత్తిన బాలీవుడ్ భామలు..

Published : Mar 18, 2022, 06:54 PM IST

ఏరంగంలో అయినా తమ కంటే చిన్నవారికి..ముఖ్యంగా ఆడవారికి కెరీర్ బిగినింగ్ లో ఇబ్బందులు, వేధింపులు తప్పవు. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అవి ఎక్కువ. ఇక స్టార్ హీరోల ఆధిక్యం వల్ల హీరోయిన్లకు జరుగుతున్న నష్టంపై సందర్భానుసారం స్పందిస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు.. 

PREV
18
కంగనా బాటలోనే తాప్సీ, కృతి సనన్, పురుషాధిపత్యంపై గళమెత్తిన బాలీవుడ్ భామలు..

ఇండస్ట్రీలో వేధింపులు అంటే ఏ అండా లేని వారికి మాత్రమే కాదు.. ఇప్పుడు స్టార్ పోజిషన్ లో ఉన్నవారికి కూడా తప్పలేదు. ముఖ్యంగా మెల్ డామినేషన్ గురించి బాలీవుడ్ భామలు రకరకాల సందర్భాల్లో గళమెత్తినవారే. రీసెంట్ గా కృతి సనన్ ఈ విషయంలో స్పందించగా.. గతంలో కంగనా, తాప్సీలాంటి వారు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. 

28

బాలీవుడ్ లో పురుషాధిపత్యం పై స్పందించింది స్టార్ హీరోయిన్ కృతీ సనన్. బచ్చన్ పాండే మూవీ ప్రమోషన్స్ సందర్భంగా కృతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హీరో పాత్రకు సమానంగా హీరోయిన్ పాత్ర ఉంటే మూవీ చేయనని చెప్పే నటులు చాలా మంది ఉన్నారంటుంది.  హీరోయిన్ పాత్రకు 60 శాతం,  హీరో పాత్రకు 40 శాతం స్క్రీన్ స్పేస్ ఉంటే చేయనని చెప్పే మేల్ యాక్టర్స్ ఉన్నారు. ఈ ఆలోచనా విధానంలో మార్పు రావాలి. అంటుంది కృతీ సనన్. 

38

అంతే కాదు అత్రంగి రే మూవీ విషయంలో కృతీ సనన్  అక్షయ్ కుమార్ సాహసాన్ని  మెచ్చుకున్నారు. అందరిలా ఆలోచించకుండా ఈసినిమాలో ఆయన నటించారని ఆమె అన్నారు.  ఆ మూవీలో ఆయన పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ నిడివి తక్కువగా ఉంటుంది. అయినా అక్షయ్ నిజాయితీతో ఆ పాత్ర చేశారంటూ.. ఆకాశానికెత్తారు శ్రుతీ. 
 

48

ఇక ఈ విషయంలో ఎప్పటి నుంచో పోరాడుతుంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. బాలీవుడ్ లో తనకు జరిగినన్న అవమానాలు ఇంకెక్కడా జరిగి ఉండవంటుంది. పురుషాధిపత్యంతో పాటు.. ఇండస్ట్రీలోని వారసత్వం వల్ల చాలా మంది అవమానాలు పడుతున్నారంటుంది. ఆఖరికి తనను కూడా ఇండస్ట్రీ నుంచి గెంటివేయాలని చాలా ట్రై చేశారంటుంది కంగన. బాలీవుడ్ తో ఏక్తా కపూర్ లాంటి కొంత మంది మాత్రమే తనకు అండగా ఉన్నారంటుంది కంగనా రనౌత్ . 
 

58

బాలీవుడ్ లో కంగనా తరువాత అదే రేంజ్ లో ఫైర్  బ్రాండ్ గా పేరు తెచ్చుకుంద తాప్సీ. టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి.. బాలీవుడ్ కు వలస వెళ్లిన తాప్పీ.. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళతో పోరాటం చేసింది. ఎన్నో ఇబ్బందులు పడి తనకంటూ సొంత ఇమేజ్ ను సాధించింది తాప్సీ పన్ను. చాలా సందర్భాల్లో పురుష ఆధిపత్యం వల్ల ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది తాప్సీ. 

68

ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా కూడా ఇలాంటి సందర్భాలను తాను చాలా ఫేస్ చేసినట్టు చెప్పింది. తమ వీక్ నెస్ ను అడ్డం పెట్టుకుని కొంత మంది చసే పనులకు చాలా మంది బాధపడవలసి వస్తుందని. అది జీవితాంతం వెంటాడుతుందని గతంలో చెప్పింది దీపిక. తాను కూడా ఇలాంటి ప్రభావంతో డిఫ్రెషన్ లోకి  వెళ్లి.. మళ్లీ బయట పడినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

78

అటు ప్రియాంక కూడా బాలీవుడ్ లో కొంత మంది పై సందర్భం ప్రకారం కామెంట్లు చేసింది. హాలీవుడ్ అవకాశాలతో తాను ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే.. సపోర్ట్ చేయకపోగా తనను వెనక్కి లాగాలని ప్రయత్నం చేశారంటూ ప్రియాంక  కొన్ని సందర్భాలలో చెప్పుకొచ్చింది. 
 

88

ఇక బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. ప్రయోగాత్మక సినిమాలు స్టార్ విద్యాబాలన్ అయితే తాను  బాలీవుడ్ లో ఎన్నో చిత్ర హింసలు అనుభవించాను అంటుంది. ఓ నిర్మాత చేసిన అవమానం వల్ల తనను తాను అసహించుకునే పరిస్థితి ఏర్పడిందంటోంది. ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా పురుషాధిపత్యం.. పురుష అహంకారం వల్ల  చాలా మంది ఇబ్బంది పడుతున్నారి. దానివల్ల ఫిల్మ్ ఇండస్టరీలో హీరోయిన్స్ టాలెంట్ బయటకు రావడం లేదంటున్నారు. 
 

click me!

Recommended Stories