Nallamala Movie Review: `నల్లమల` మూవీ రివ్యూ.. రేటింగ్‌

Published : Mar 18, 2022, 06:50 PM IST

విలన్‌ పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు అమిత్‌ తివారి. తాజాగా ఆయన `నల్లమల` సినిమాతో హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేశారు.  బిగ్‌బాస్‌ 2 ఫేమ్‌ భానుశ్రీ ఇందులో హీరోయిన్‌గా నటించింది. శుక్రవారం(మార్చి 18)న విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా? అనేది సినిమా రివ్యూలో తెలుసుకుందాం.  

PREV
17
Nallamala Movie Review: `నల్లమల` మూవీ రివ్యూ.. రేటింగ్‌

ఇటీవల `రా`గా ఉండే సినిమాలు బాగా ఆడుతున్నాయి. `రంగస్థలం` ఓ ట్రెండ్‌గా నిలిచింది. ఇటీవల వచ్చిన `పుష్ప` సంచలనం సృష్టించింది. అదే కోవలో వచ్చిన మరో చిన్న చిత్రం `నల్లమల`. విలన్‌ పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు అమిత్‌ తివారి. తాజాగా ఆయన హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేశారు. సందేశాత్మక చిత్రాన్ని ఎంచుకున్నారు. నటి, బిగ్‌బాస్‌ 2 ఫేమ్‌ భానుశ్రీ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఆవు, అడవి గొప్పతనం, అడవిలోని మనుషుల పోరాటాన్ని తెలిపే కథాంశంతో దర్శకుడు రవిచరణ్‌ ఈ సినిమాని రూపొందించారు. శుక్రవారం(మార్చి 18)న ఈ సినిమా విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా? అనేది సినిమా రివ్యూ(Nallamala Movie Review)లో తెలుసుకుందాం.  

27

కథః
నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతిని, సాధు జంతువులను ప్రేమించే గిరిజన యువకుడు నల్లమల (అమిత్ తివారి) తనగూడెంలో నివసిస్తున్న వారికి సహాయం చేస్తుంటాడు. అదే సమయంలో అక్రమ వ్యాపారాలు చేసే వారికి సహాయం చేస్తుంటాడు.  ఆ గూడెంలోని  వనమాలి(భాను శ్రీ) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు నల్లమల. ఆమె అంటే అతనికి ప్రాణం. నల్లమల వద్ద మేలు రకం జాతి ఆవులు ఉంటాయి. అవంటే అతనికి పంచ ప్రాణాలు. కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా నల్లమల.. అక్రమ వ్యాపారం చేసేవారికి ఎదురు తిరుగుతాడు. మరి వీరిమధ్య గొడవకి కారణమేంటి? నల్లమలలో అవినీతి పోలీస్ ఆఫీసర్ (కాలకేయ ప్రభాకర్), అక్రమ వ్యాపారి (అజయ్ ఘోష్) చేసే అనైతిక పనులు ఏమిటి? అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ వ్యాపారం ఏమిటి? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన సినిమా. Nallamala Movie Review.

37

విశ్లేషణః  
అడవిలోని ఓ అవుచుట్టూ సాగే కథ ఇది. కాకపోతే పూర్తి రా, రస్టిక్‌గా సాగుతుండటంతో ఓ కొత్త ఫీలింగ్‌ కలుగుతుంది. శాస్త్రవేత్తగా నటించిన నాజర్‌ ని గిరిజనులు వెంటాడటమనే ఎమోషనల్‌ పాయింట్‌తో సినిమా ప్రారంభమవుతుంది. ప్రారంభంలోనే సినిమాపై అసక్తిని రేకెత్తిస్తుంది. దీనికి తోడు స్కూల్‌ పిల్లలకు ఎలాంటి అంశాలతో పాఠ్యాంశాన్ని పుస్తకంలో చేర్చాలనే పాయింట్‌ మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. ఇలా స్టార్టింగ్‌ పాయింట్‌తోనే సినిమా ఓ కొత్త పాయింట్‌తో సాగుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే మాజీ నక్సలైట్ అయిన చత్రపతి శేఖర్ చెప్పే ఫ్లాష్ బ్యాక్‌ కాస్త స్లోగా సాగడంతో ఆడియెన్స్ ఓపికని పరీక్షించిన ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ఆవు చుట్టూ తిరిగే భావోద్వేగమైన పాయింట్‌ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం కొత్తగా ఉంది. Nallamala Movie Review

47

సెకండాఫ్‌లోనూ అసలు కథపై క్లారిటీ రాకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. ప్రీ క్లైమాక్స్ లో అసలు విషయం రివీల్‌ అవుతుంది. దాన్ని మరింత బాగా డిజైన్‌ చేసుకుంటే బాగుండేది.  అయితే ఆవు చుట్టూ తిరిగే భావోద్వేగమైన పాయింట్‌ లో సైతం ఎమోషన్స్ ని మరింత స్ట్రాంగ్‌గా రాసుకోవాల్సింది. దర్శకుడికి మొదటి సినిమా కావడంతో ఆ అనుభవ లేమి తెరపై కనిపిస్తుంది. కానీ ఓ మంచి విషయాన్ని సిన్సియర్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాస్త స్లో కథ సాగడంతో బోర్‌ ఫీలింగ్‌ ఉంటుంది.  Nallamala Movie Review

57

నటీనటులుః 
విలన్‌గా మెప్పించిన అమిత్ తివారీ హీరోగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ పండించే ఆస్కారం దొరికింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టాడు. భాను శ్రీ గ్లామర్ పరంగా, డ్యాన్సుల పరంగా ఆకట్టుకొంది. అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, నాజర్, తనికెళ్ల భరణి పాత్రలు వాటి పరిధి మేరకు ఫర్వాలేదనిపించాయి. Nallamala Movie Review

67

టెక్నీకల్‌గాః 
నల్లమల సినిమాకు బ్యాక్ గ్రౌండ్, సినిమాటోగ్రఫి స్కోర్ ప్రత్యేక ఆకర్షణ. బీజీఎంతో కొన్ని సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయి. యాక్షన్ సీన్లు, అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ వేణు మురళీ తన కెమెరాలో చక్కగా బంధించాడు. సిద్ శ్రీరామ్ పాడిన `ఏమున్నావే పిల్ల` పాట ఆడియో పరంగా ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. దర్శకుడు రావి చరణ్‌.. తొలి సినిమాతోనే తన మార్క్ ని చాటుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో మేకర్స్ గా ఫర్వాలేదనిపించాడు. ఓవరాల్‌గా అటవీ ప్రాంతంలో జరిగే అన్యాయాలు, వాటిని ఎదురించిన గిరిజన యువకుడి కథ, కథనాలు గ్రామీణ వాతావరణం ఫ్రెష్‌ ఫీలింగ్‌ని కలిగిస్తాయి. నెటివిటీని ఇష్టపడే వారికి నచ్చే చిత్రమవుతుంది. Nallamala Movie Review.

77

రేటింగ్‌ః 2.5

నటీనటులు: అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ముక్కు అవినాష్ తదితరులు
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్
నిర్మాత: ఆర్ఎమ్
సినిమాటోగ్రఫి: వేణు మురళి
సంగీతం, పాటలు: పీఆర్
ఎడిటర్: శివ సర్వాణి
ఆర్ట్: యాదగిరి

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories