ఈ సందర్భంగా ఇటీవల రష్మిక మందన్నాపై ట్రోల్స్, మీమ్స్ వచ్చిన విషయం తెలిసిందే. కన్నడ చిత్ర పరిశ్రమ రష్మికని బ్యాన్ చేయబోతుందనే వార్తలొచ్చాయి. తాజాగా వాటిపై స్పందించింది. తనని బ్యాన్ చేస్తున్నారనేదాంట్లో నిజం లేదని, అలా ఇప్పటి వరకు జరగలేదే అని తెలిపింది. `కాంతార` సినిమా చూడటంపై కూడా క్లారిటీ ఇచ్చింది. రిలీజ్ టైమ్‌లో తనని అడిగారని, అప్పుడు చూడలేదని, ఆ తర్వాత చూసి వారికి మెసేజ్ కూడా పెట్టానని, వాళ్లు థ్యాంక్స్ చెప్పారని పేర్కొంది.