రష్మిక మందన్నా మరో డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్‌.. మళ్లీ నేషనల్‌ క్రష్‌ని టార్గెట్ చేసిన దుండగులు..

Published : Dec 13, 2023, 10:50 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా మరోసారి డీప్‌ ఫేక్‌ వీడియో వివాదం బారిన పడింది. మరోసారి దుండుగులు ఆమెని టార్గెట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతుంది.   

PREV
16
రష్మిక మందన్నా మరో డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్‌.. మళ్లీ నేషనల్‌ క్రష్‌ని టార్గెట్ చేసిన దుండగులు..

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా కొన్ని రోజుల క్రితం డీప్‌ ఫేక్‌ వివాదంలో ఇరుక్కుంది. కొందరు దుండగులు ఆమె ఫేస్‌ని మార్ఫింగ్‌ చేసి షాకిచ్చారు. దాన్నుంచి బయటపడి ఇప్పుడు `యానిమల్‌` సినిమాతో సంచలనంగా మారింది రష్మిక. ఈ సినిమాతో ఆమె నేషనల్‌ వైడ్‌ అటెన్షన్‌ మరోసారి తనవైపు తిప్పుకుంది. ఇలాంటి చిల్లర వేషాలు తన కింద దిగదుడుపు అని చాటి చెప్పింది. 

26

తాజాగా మరోసారి రష్మికకి షాకిచ్చారు దుండగులు. మరోసారి ఆమె డీప్‌ ఫేక్‌ వీడియోని వదిలేశారు. అప్పుడు చేసిన వీడియోకి కొనసాగింపుగా మరో డీప్‌ ఫేక్‌ వీడియోని సోషల్‌ మీడియాలో వదిలారు. ఇప్పుడు అది దుమారం రేపుతుంది. ఇందులోనూ సేమ్‌ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్‌ని మార్ఫింగ్‌ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్‌ రచ్చ చేస్తుంది. 
 

36

అయితే ఈ సారి మరింత క్లీయర్‌ కట్‌తో ఈ డీప్‌ ఫేక్‌ వీడియో చేశారు. ఇది చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నెటిజన్లు స్పందస్తున్నారు. మరోసారి దుండగులపై దుమ్మెత్తిపోతున్నారు. ఇలాంటి ఆపాలని డిమాండ్‌ చేస్తున్నారు.అదే సమయంలో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ రష్మికకి ఇలాంటివి వరుసగా ఎదురు కావడం బాధాకరమనే చెప్పాలి. మరి వీటిపై అధికారులు, పోలీసులు ఎలాంటి  చర్యలు తీసుకుంటారో చూడాలి. 
 

46

తాజాగా రష్మిక మందన్నా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది. బ్రౌన్‌ కలర్‌ డ్రెస్‌లో మెరిసింది. టైట్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. తన వయ్యారాలు ఒలకబోస్తూ మత్తెక్కించే పోజులిచ్చింది. ప్రస్తుతం ఈపిక్స్ సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

56

 ఇటీవల `యానిమల్‌` చిత్రంతో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది రష్మిక మందన్నా. `పుష్ప` చిత్రంతోనే ఆమె పాన్‌ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ `యానిమల్‌` చిత్రంతో దాన్ని మించిన ఇమేజ్‌ని క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఏడు వందల కోట్లు దాటి వెయ్యి కోట్ల దిశగా వెళ్తుంది. ఇందులో రణ్‌బీర్‌కి జోడీగా అదరగొట్టింది రష్మిక. కెరీర్‌ బెస్ట్ పర్‌ఫెర్మెన్స్ ఇచ్చింది. దీంతో బాలీవుడ్‌ బిజీ కాబోతుందీ బ్యూటీ. 

66

ప్రస్తుతం ఈ అమ్మడు `పుష్ప2` లో నటిస్తుంది. మరో సారి శ్రీవల్లిగా సందడి చేయడానికి రెడీ అవుతుంది. అలాగే `ది గర్ల్ ఫ్రెండ్` అనే చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించింది. దీంతోపాటు `రెయిన్‌ బో` అనే సినిమా చేస్తుంది. అలాగే `యానిమల్‌ పార్క్‌`లోనూ పార్ట్ కాబోతుంది. మొత్తానికి ఇప్పుడు రష్మిక రేంజ్‌ పెరిగింది. ఇండియాలోనే టాప్‌ మోస్ట్ హీరోయిన్‌గా నిలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories