`జబర్దస్త్`లోకి మనో రీఎంట్రీ.. బాగుంది భోజనం, రాత్రి ఉంది శోభనం అంటూ యాంకర్‌ రష్మి పంచ్‌లు.. ఇదేం రచ్చ

Published : Dec 13, 2023, 09:26 PM IST

జబర్దస్త్ షోలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యాంకర్లు, జడ్జ్ లు మారిపోతున్నారు. ఇప్పుడు మళ్లీ జడ్జ్ మారిపోయాడు. ఇక యాంకర్‌ రష్మి వేసిన పంచ్‌ మతిపోగొడుతుంది.   

PREV
17
`జబర్దస్త్`లోకి మనో రీఎంట్రీ.. బాగుంది భోజనం, రాత్రి ఉంది శోభనం అంటూ యాంకర్‌ రష్మి పంచ్‌లు.. ఇదేం రచ్చ

ఈటీవీలో వచ్చే `జబర్దస్త్`, `ఎక్స్‌ ట్రా జబర్దస్త్` షోలో ఇటీవల అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. `జబర్దస్త్` నుంచి సౌమ్య రావు వెళ్లిపోయింది. ఆమె స్థానంలో సిరి వచ్చింది. అలాగే ఎక్స్ ట్రా జబర్దస్త్ షో నుంచి జడ్జ్  ఖుష్బు వెళ్లిపోయింది. ఆమె స్థానంలో మహేశ్వరి జడ్జ్ గా వచ్చారు. కానీ మూనాళ్ల ముచ్చట అన్నట్టుగానే ఆమె మూడు వారాలు చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు కొత్తగా మనో షోకి జడ్జ్ గా వచ్చారు. 
 

27

గతంలో మనో జడ్జ్ గా చేశారు. నాగబాబు షోని వీడటంతో ఆయన స్థానంలో మనో వచ్చారు. మనో, రోజా కాంబినేషన్‌ మంచి పేరొచ్చింది. టీఆర్‌పీ కూడా బాగానే వచ్చింది. కానీ మనోకి వేరే పాటల కార్యక్రమానికి జడ్జ్ గా వెళ్లాల్సి రావడంతో `జబర్దస్త్`ని వదిలేశాడు. ఇప్పుడు మళ్లీ ఆయన రీఎంట్రీ ఇచ్చాడు. కృష్ణభగవాన్‌తో కలిసి ఆయన జడ్జ్‌ గా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ ప్రోమోలో ఈ విషయం స్పష్టమవుతుంది. 

37

ఇదిలా ఉంటే ఇందులో యాంకర్‌ రష్మి వేసిన పంచ్‌లు హైలైట్‌గా నిలుస్తున్నాయి. దీంతోపాటు సుజాత అబ్బాయి గెటప్‌లో రావడం, రివ్యూలతో పాపులర్‌ అయిన లక్కీ లక్ష్మణ్‌ జబర్దస్త్ షోలోకి రావడం హైలైట్‌గా నిలిచింది. ఆ మధ్య జబర్దస్త్ లో మెరిశాడు లక్ష్మణ్‌. మళ్లీ గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు అతను కూడా రీఎంట్రీ ఇచ్చాడు. తనదైన పంచ్‌లతో రెచ్చిపోయింది. ఎంట్రీతోనే అదరగొట్టాడు. 
 

47

రావడం రావడంతోనే రష్మిని టార్గెట్‌ చేశాడు. హాయ్‌ రష్మి ఎలా ఉన్నావని పలకరిస్తూనే.. బ్రో.. జడ్జ్ లు ఇస్తారు మార్కులు టెన్ను, అప్పుడే వేసింది రష్మి నా మీద కన్ను అంటూ రెచ్చిపోయింది. దీనికి జబర్దస్త్ యాంకర్‌ క్రేజీగా రియాక్ట్ అయ్యింది. అంతటితో ఆగలేదు. నువ్వు ఓకే అంటే వెళ్దాం గోవా. నువ్వు ఊ అంటే నీ తమ్ముడికే నీనే బావ అంటూ మరో పంచ్‌తో రెచ్చిపోయాడు. నువ్వు ఇక స్టేజ్‌పైకి రావా అంటూ కృష్ణభగవాన్‌ మరో పంచ్‌ వేయడంతో లక్ష్మణ్‌కి దిమ్మ తిరిగిపోయింది. 
 

57

ఇక లక్ష్మణ్‌ తన భార్యతో కలిసి సరదాగా ముచ్చటిస్తున్నాడు. ఆమె ఆయనకు అన్నం పెట్టింది. ఎలా ఉందండి భోజనం అని అడుగుతుంది. సూపర్‌గా ఉందని రియాక్ట్ అవుతాడు. ఇలా అడిగితే ముష్టి వాడు కూడా చెబుతాడు. మీ స్టయిల్‌లో చెప్పాలని ఆమె అడుగుతుంది.

67

దీనికి రష్మి రియాక్ట్ అయ్యింది. ఆ డైలాగ్‌ నేను చెబుతా అంటూ.. బాగుంది భోజనం.. రాత్రుంది శోభనం` అంటూ రెచ్చిపోయింది. దీనికి లక్ష్మణ్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. 

77

ఇదిలా ఉంటే ఇందులో జబర్దస్త్ కమెడియన్‌ సుజాత అబ్బాయి గెటప్ లో వచ్చింది. టీషర్ట్, ప్యాంట్‌ ధరించి వచ్చి కామెడీ చేయబోయింది. రష్మి నాకు తెలుసు, నా అందం చూసి నువ్వు ఫ్లాట్‌ అయ్యావ్‌. కొరకాలనిపిస్తుందా? అంటూ దగ్గరకు వెళ్లింది. దీంతో ఆమెని పట్టుకుని రావే అంటూ యాంకర్‌ రష్మి లాగడం హైలైట్‌గా నిలిచింది. నవ్వులు పూయిస్తుంది. లేటెస్ట్ ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో వైరల్‌ అవుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories