Latest Videos

రష్మిక మందన్నా చేతిలో ఇన్ని సినిమాలున్నాయా?.. ఇండియాలోనే టాప్‌.. నేషనల్‌ క్రష్షా మజాకా!

First Published May 26, 2024, 6:07 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం బిజీయెస్ట్ హీరోయిన్ గా నిలిచింది. ఇండియాలోనే ఆమె టాప్‌ పొజీషియన్‌లో నిలవడం విశేషం. ఆమె చేతిలో ఎన్ని సినిమాలున్నాయంటే?
 

రష్మిక మందన్నా సైలెంట్‌గా వచ్చి సునామీ సృష్టిస్తుంది. ఆమె ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇండియాలోనే టాప్‌ హీరోయిన్‌ పొజీషియన్‌కి చేరుకుంది. పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తుంది. ఈ క్రమంలో భారీ సినిమా ఆఫర్లని దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. 

రష్మిక మందన్నా చేతిలో ఏకంగా తొమ్మిది సినిమాలుండటం విశేషం. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్‌తో కలిసి `పుష్ప2`లో నటిస్తుంది. ఇందులో శ్రీవల్లిగా మరోసారి రచ్చ చేయబోతుంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 15న రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో పాన్‌ ఇండియా హీరోయిన్‌ ఇమేజ్‌ని దాటి గ్లోబల్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకునేందుకు రెడీ అవుతుంది రష్మిక మందన్నా. 
 

దీంతోపాటు రెండు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. `రెయిన్‌బో` అనే ఓ సినిమా చేస్తుంది. తెలుగు, తమిళంలో ఇది రూపొందుతుంది. పాన్‌ ఇండియా రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన అప్‌ డేట్‌ రావాల్సి ఉంది. మరోవైపు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో `ది గర్ల్ ఫ్రెండ్‌` సినిమా చేస్తుంది రష్మిక మందన్నా. ఈ రెండు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో నటిగా తానేంటో నిరూపించుకోబోతుంది నేషనల్‌ క్రష్‌. 
 

మరోవైపు హిందీలో రెండు సినిమాలు చేస్తుందట. ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ సరసన `సికందర్‌` మూవీని ప్రకటించారు. ఇందులో బాలీవుడ్‌ కండల వీరుడుకి జోడీగా నటిస్తుంది. దీంతోపాటు `చావా` అనే మరో హిందీ సినిమాకి సైన్‌ చేసిందట రష్మిక. దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ రావాల్సి ఉంది. 
 

మరోవైపు తమిళంలో రెండు సినిమాలు చేయబోతుంది. ఇప్పటికే ధనుష్‌, నాగార్జున కలిసి నటిస్తున్న `కుబేరా`లో హీరోయిన్‌గా ఎంపికైంది. ధనుష్‌కి జోడీగా చేయబోతుంది. ఇది పాన్‌ ఇండియా స్కేల్‌లోనే రూపొందుతుంది. మరోవైపు శివ కార్తికేయన్‌తో ఓ సినిమా కూడా ఫైనల్‌ అయ్యిందట. త్వరలోనే ప్రకటన ఉండబోతుందని సమాచారం. 

ఇవే కాకుండా మరో రెండు తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. ఎన్టీఆర్‌తో తొలిసారి జోడీ కట్టబోతుందని సమాచారం. ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతుంది. ఈ ఏడాది ఆగస్ట్ లోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఇందులో తారక్ కి జోడీగా రష్మిక కనిపించబోతుందని సమాచారం. 

అలాగే తన ప్రియుడు విజయ్‌ దేవరకొండతోనూ సినిమా చేస్తుందట. రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ హిస్టారికల్‌ మూవీ చేస్తున్నారు విజయ్‌ దేవరకొండ. ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఇందులో విజయ్‌కి జోడీగా రష్మిక కనిపిస్తుందని సమాచారం. `గీతా గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాల తర్వాత ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కాబోతుందని సమాచారం. ఇలా వరుసగా తెలుగు, తమిళం, హిందీలో తొమ్మిది ప్రాజెక్ట్ లతో రష్మిక మందన్నా ఇండియన్‌ హీరోయిన్ల అందరిలోనూ టాప్‌లో ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా విజయాలు సాధిస్తే రష్మిక క్రేజ్‌, రేంజ్‌ మరింత పెరగిపోతుందని చెప్పొచ్చు. 
 

click me!