విజయశాంతిని హీరోయిన్‌గా తిరస్కరించిన సూపర్‌స్టార్‌ కృష్ణ.. విజయ నిర్మల ఏం చేసింది? ఆమె చెప్పిందే జరిగిందా?

First Published May 26, 2024, 5:11 PM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ, విజయశాంతి కలిసి 13 సినిమాల్లో నటించారు. కానీ విజయశాంతిని హీరోయిన్‌గా తొలి సినిమాకి రిజెక్ట్ చేశాడట కృష్ణ. మరి విజయ నిర్మల ఏం చేసిందంటే?
 

 తెలుగు సినిమాల్లో తొలి లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ ని సొంతం చేసుకున్న నటి విజయశాంతి. దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు తెలుగు సినిమాని శాషించింది విజయశాంతి. హీరోయిన్‌గా ప్రారంభమైన ఆమె కెరీర్‌, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు ప్రాణం పోసింది. ఆయా సినిమాలు కూడా హీరోలకు దీటుగా ఆడతాయని, బాక్సాఫీసు వద్ద కలెక్షన్లని సాధిస్తాయని నిరూపించింది. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. 

విజయశాంతి హీరోయిన్‌గా కెరీర్‌ 1980లో ప్రారంభమైంది. ఆమె మొదటి సూపర్‌ స్టార్ కృష్ణ హీరోగా రూపొందిన `కిలాడి కృష్ణుడు` చిత్రంలో నటించింది. కృష్ణకి జోడీగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దీనికి విజయ నిర్మల దర్శకురాలు. తొలి సినిమాతోనే మెప్పించింది విజయశాంతి. అందంతో కట్టిపడేసింది. ఈ మూవీ చూశాక తెలుగు తెరకి ఓ అందమైన కథానాయిక దొరికిందని అభిప్రాయపడ్డారట. 
 

అయితే ఇందులో హీరోయిన్‌గా విజయశాంతిని తీసుకోవాలనుకున్నప్పుడు మొదట హీరో కృష్ణ నో చెప్పాడట. చిన్న పిల్లలా ఉంది, హీరోయిన్‌గా సెట్‌ కాదు, వద్దు అన్నాడట. దీంతో దర్శకురాలు విజయ నిర్మల డైలమాలో పడిందట. కానీ తనకేమో నమ్మకం ఉందట. ఈ అమ్మాయిలో మంచి నటి లక్షణాలున్నాయి, అందంగా ఉంది, భవిష్యత్‌లో పెద్ద ఆర్టిస్ట్ అవుతుందని నమ్మిందట. కానీ కృష్ణ వద్దు అని చెప్పేశాడు. 
 

నెమ్మదిగా సూపర్‌ స్టార్‌ని కన్విన్స్ చేసింది విజయ నిర్మల. భర్తనే కావడంతో ఆయన్ని కూల్‌గా డీల్‌ చేసిందట. ఆ అమ్మాయి చూడు భవిష్యత్‌లో పెద్ద హీరోయిన్ అవుతుంది అని చెప్పిందట. అన్నట్టుగానే తొలి సినిమాతో అందంతో ఆకట్టుకున్న విజయశాంతి ఆ తర్వాత హీరోయిన్‌గా అద్భుతమైన నటన, డాన్సులతో అదరగొట్టింది. క్రమంలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసి యాక్షన్‌తోనూ మెప్పించింది. 
 

సూపర్‌ స్టార్స్ కి ధీటుగా సినిమాలు చేసి మెప్పించింది. ఆమె సినిమాలు బాక్సాఫీసు వద్ద ఇతర స్టార్‌ హీరోలకు దీటుగా ఆడాయంటే అతిశయోక్తి కాదు. తిరుగులేని లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగింది. ఎన్టీఆర్‌ నుంచి చిరు, బాలయ్య, నాగ్‌, వెంకీలతోనూ కలిసి నటించింది విజయశాంతి. ఈ క్రమంలో ఆమె 2006 తర్వాత సినిమాలకు దూరమయ్యారు. రాజకీయాల్లో ఫుల్‌ యాక్టివ్‌గా మారారు. చాలా ఏళ్ల తర్వాత ఇటీవల మహేష్‌ బాబు నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో కీలక పాత్రలో మెరిశారు. విజయశాంతి కెరీర్‌ ప్రారంభమైందే కృష్ణతో, మళ్లీ రీఎంట్రీ కూడా ఆయన వారసుడు మహేష్‌తో కావడం విశేషం.
 

ఇక కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అందులో `కిలాడి కృష్ణుడు`, `అగ్ని పర్వతం`, `బ్రహ్మాస్త్రం`, `సర్దార్‌ కృష్ణమనాయుడు`, `ముద్దాయి`, `దొంగగారూ స్వాగతం`, `అశ్వథ్థామ`, `గూండా రాజ్యం`, `కొడుకు దిద్దిన కాపురం`, `నాగాస్త్రం`, `దొరగారికి దొంగ పెళ్లాం` చిత్రాల్లో ఇద్దరు కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో 11 సినిమాలు వచ్చాయి. మరోవైపు ఈ ఇద్దరు జోడీగా కాకుండా మరో రెండు సినిమాలు చేశారు. అందులో `కృష్ణావతారం`, `ఒసేయ్‌ రాములమ్మ` చిత్రాలున్నాయి. 

click me!