ఇప్పటికే ఐదు సార్లు చేశారు.. అయినా మ్యారేజ్‌ చేసుకోవడం పక్కా.. పెళ్లిపై హీరోయిన్‌ అంజలి క్రేజీ రియాక్షన్‌..

First Published May 26, 2024, 3:32 PM IST

హీరోయిన్ అంజలిపై ఇటీవల పెళ్లి వార్తలు షాకిచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చారు. పెళ్లి చేసుకోవడం పక్కా అని తేల్చి చేప్పేసింది అంజలి. 
 

తెలుగు హీరోయిన్‌ అంజలి.. తెలుగులో మరోసారి స్పీడ్‌ పెంచింది. తమిళంలో హీరోయిన్‌గా ఎదిగిన ఆమె తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. ఇటీవల ఆమెకి టాలీవుడ్‌లో కొంత గ్యాప్‌ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. వరుసగా మూడు నాలుగు సినిమాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`తో అలరించేందుకు వస్తుంది. ఈ ఫ్రైడే ఈ మూవీ రాబోతుంది. 
 

అంజలి మ్యారేజ్‌కి సంబంధించిన రూమర్స్ ఇటీవల బాగా వినిపించాయి. అంతేకాదు పెళ్లి కూడా చేసుకుందనే వార్తలొచ్చాయి. ఆ మధ్య దీనిపై స్పందించింది అంజలి. తాజాగా మరోసారి వివరణ ఇచ్చింది. తన మ్యారేజ్‌ రూమర్లు వస్తూనే ఉన్నాయని, ఇప్పటికే నాలుగైదు సార్లు మ్యారేజ్‌ చేశారని తెలిపారు. అయితే మొన్న వచ్చిన రూమర్లతో తమ బంధువులు కూడా ఫోన్‌ చేసి ఆరా తీశారట. అంతగా రూమర్లు ప్రభావితం చేస్తున్నాయని తెలిపింది అంజలి. 
 

అయితే అలాగని తాను పెళ్లికి దూరం కాదు అని, కచ్చితంగా మ్యారేజ్‌ చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదని తెలిపింది అంజలి. ప్రస్తుతం తన ఫోకస్‌ అంతా సినిమాలపైనే ఉందని, మ్యారేజ్‌ చేసుకుంటే రెండింటిని మ్యానేజ్‌ చేయలేనని తెలిపింది. ఇటు సినిమాని, అటు వ్యక్తిగత జీవితాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పింది అంజలి. ప్రస్తుతం ఇదిగో ఇతన్ని చేసుకుంటానని ఇంట్లో చెప్పేంత టైమ్‌ కూడా ఉండటం లేదని, ఏదో ఒక సినిమాతో బిజీగా ఉంటున్నట్టు చెప్పింది అంజలి. 

ప్రస్తుతం హీరోయిన్లు చాలా మంది పెళ్లి చేసుకున్నాక కూడా హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సినిమాలు చేస్తున్నారు. పెళ్లైన నెక్ట్స్ డేనే అమ్మాయిలు ఆఫీస్‌లకు వెళ్తున్నారు. వారిలాగే మేం కూడా సినిమా షూటింగ్‌లకు వెళ్తున్నాం, ఇది చాలా మంచి వాతావరణం అని తెలిపింది అంజలి. ఆ విషయంలో హీరోయిన్లని అభినందించాల్సిందే అని చెప్పింది అంజలి.

ఇక ప్రస్తుతం ఆమె విశ్వక్‌సేన్‌తో కలిసి `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` చిత్రంలో నటిస్తుంది. నేహా శెట్టి మరో హీరోయిన్‌. ఇందులో తాను రత్నమాల పాత్రలో నటిస్తున్నానని, బలమైన పాత్ర తనది అని, విశ్వక్‌ సేన్‌తోపాటు ఉంటానని చెప్పింది. తాను హీరోయిన్‌గానే కాదు, ఇలాంటి బలమైన పాత్రలు చేయాలని అనుకుంటున్నానని, అందులో భాగంగానే ఈ కథ నచ్చి సినిమా చేసినట్టు చెప్పింది. తనది ఇందులో కీ రోల్‌ కాదని, మరో హీరోయిన్‌ పాత్ర అని చెప్పడం విశేషం. సినిమాలో తనపై పాట కూడా ఉంటుంది. డైలాగ్‌ లు కూడా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. కెరీర్‌ పరంగా తనని మరో యాంగిల్‌లో ఆవిష్కరించే చిత్రమవుతుంది.
 

`సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాలో తాను సాఫ్ట్ గా ఎలా ఉంటానో చూపించారు. దానికి అపోజిట్‌ రోల్‌ ఇందులో చేస్తున్నట్టు తెలిపింది అంజలి.  విశ్వక్‌ సేన్‌ హీరోగా నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`లో అంజలి మరో హీరోయిన్‌ పాత్రలో కనిపించబోతుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీని నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 31న సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. 

click me!