నోరు మూసుకోవడమే అన్నింటికి సమాధానమా? రష్మిక మందన్నా పోస్ట్ వైరల్‌.. కౌంటర్‌ దానికేనా?

Published : Jul 12, 2023, 09:56 PM IST

రష్మిక మందన్నా.. హీరోయిన్లలో అత్యంత చలాకీ అమ్మాయి. హై ఎనర్జిటిక్‌. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అన్నింటిని లైట్‌ తీసుకుని తనకు నచ్చిన విధంగా ఉంటుంది. ప్రతి మూవ్‌మెంట్‌ని ఎంజాయ్‌ చేస్తుంది.   

PREV
15
నోరు మూసుకోవడమే అన్నింటికి సమాధానమా? రష్మిక మందన్నా పోస్ట్ వైరల్‌.. కౌంటర్‌ దానికేనా?

నేషనల్‌ క్రష్‌గా పాపులర్‌ అయిన రష్మిక మందన్నా.. అనేక రూమర్స్ ని ఫేస్‌ చేస్తుంది. వాటిలో ప్రధానంగా ఉన్నది లవ్‌ రూమర్‌. విజయ్‌ దేవరకొండతో ప్రేమలో ఉందనే వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. వీటిపై రష్మిక స్పందించీ స్పందించనట్టుగా వ్యవహరిస్తుంది. కానీ ఎప్పుడూ వీటినిబలంగా కండించలేదు. దీనికితోడు పలు సందర్భాల్లో ఈ ఇద్దరు కలిసి కనిపించారు. రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారనేది స్పష్టమవుతుంది. కానీ వారి నుంచి మాత్రం ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 
 

25

కానీ తాజాగా రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ మాత్రం వైరల్‌ అవుతుంది. తాజాగా రష్మిక.. సోఫాలో కూర్చొని నవ్వుతూ కనిపించింది. అయితే ఆమె నవ్వుని ఆపుకుంది. రెండు చేతులతో నోరు మూసుకుని నవ్వుకుంటుంది. ఈ ఫోటోని పంచుకుంటూ `జనల్‌గా చాలా విషయాలకు నా స్పందన ఇదే` అని పేర్కొంది. నోరు మూసుకున్న ఎమోజీని, స్మైల్‌ని, లవ్‌ ఎమోజీలను పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. అయితే రష్మిక మందన్నా ఈ ఫోటో, క్యాప్షన్‌ వెనకాల ఉద్దేశ్యమేంటి? దేన్ని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందనేది ఆసక్తికరంగా మారింది.

35

ఇదిలా ఉంటే రష్మిక మందన్నా ప్రస్తుతం `పుష్ప2`తోపాటు `రెయిన్‌ బో` అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం చేస్తుంది. అలాగే నితిన్‌తో వెంకీ కుడుములతో `భీష్మ` కాంబోలో మరో సినిమా చేస్తుంది. హిందీలో `యానిమల్‌` సినిమా చేస్తుంది. దీంతోపాటు కొత్తగా ఆమె మరో రెండు సినిమాలకు సైన్‌ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని కారణంగా రష్మిక.. నితిన్‌ - వెంకీ కుడుముల ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని అంటున్నారు. ఈ వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరి దీన్ని ఉద్దేశించిన రష్మిక తాజాగా ఈ పోస్ట్ పెట్టిందా? అనేది ఆసక్తికరంగా మారింది. 
 

45
Rashmika Mandanna

ఇంకోవైపు ఎప్పటిలాగానే రష్మిక, విజయ్‌ దేవరకొండ మధ్య రూమర్‌ వార్తలు వినిపిస్తున్నాయి. తరచూ అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనికి కౌంటర్‌గా రష్మిక ఇలా రియాక్ట్ అయ్యిందా అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేజర్‌గా నితిన్‌ సినిమా నుంచి తప్పుకుందనే రూమర్లకి రష్మిక కౌంటర్‌ అని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆమె పోస్ట్ మాత్రం హాట్‌ టాపిక్‌గా మారింది. 

55

రష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ప్రతి రోజు ఏదో రూపంలో ఫ్యాన్స్ తో టచ్‌లో ఉంటుంది. వారిని అలరిస్తుంది. అప్పుడప్పుడు గ్లామర్‌ ట్రీట్‌తోనూ అలరిస్తుంది. బౌండరీలు బ్రేక్‌ చేసి హాట్‌ షో చేసి హాట్‌ టాపిక్ అయ్యింది. ట్రోల్స్ కి కూడా గురయ్యింది. కానీ వాటిని లెక్క చేయకుండా దూసుకెళ్తుంది. కన్నడ హీరోయిన్‌ నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, బాలీవుడ్‌ కి వెళ్లి ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయిందీ నేషనల్‌ క్రష్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories