నాజూకు నముడుతో కలవరపెడుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వైట్ డ్రెస్ లో దివి బ్యూటీఫుల్ లుక్

First Published | Jul 12, 2023, 7:38 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్, నటి దివి (Divi)  బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. మరోవైపు నాజూకు అందాలతో మంత్రముగ్ధులను చేస్తోంది. 
 

‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షోతో దివి మంచి ఫేమ్ దక్కించుకుంది. సీజన్ 4తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి టీవీ ఆడియెన్స్ ను అలరించింది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ వస్తోంది. 
 

గతేడాది దివి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘రుద్రంగి’తో అలరించింది. జూలై 7న ఈ మూవీ థియేటర్ లోకి వచ్చింది. 
జగపతి బాబు లీడ్ రోల్ లో నటించగా, దివి ముఖ్య పాత్ర పోషించింది. 
 


బిగ్ బాస్ ద్వారా ఆడియెన్స్ కు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తోంది. క్రమక్రమంగా అవకాశాల సంఖ్యను పెంచుకుంటోంది. ఏ చిన్న ఆఫర్ ను కూడా వదలకుండా వినియోగించుకుంటోంది. తన సినిమానూ మంచిగా ప్రమోట్ చేసుకుంటోంది. 
 

సినిమాల విషయంలో దివి ప్లానింగ్ ప్రకారమే వెళ్తున్నది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను వందశాతం మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమేరకు మంచి రెస్పాన్స్ నూ సొంతం చేసుకుంది. మరోవైపు తన క్రేజ్ ను మరింతగా పెంచుకునేందుకు నెట్టింట కూడా దర్శనమిస్తోంది.
 

సోషల్ మీడియాలో దివి ఎప్పటి నుంచో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, గ్లామర్ ఫొటోషూట్లకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ మరింత దగ్గరవుతున్నారు. ఇక ట్రెడిషనల్, ట్రెండీ వేర్స్ లో మెరుస్తూ అందాల ప్రదర్శన కూడా చేస్తోంది.
 

తాజాగా మాత్రం దివి బ్యూటీఫుల్ లుక్ లో ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది. వైట్ లెహంగా, వోణీ, మ్యాచింగ్ బ్లౌజ్ లో అచ్చ తెలుగమ్మాయి మరింత అందాన్ని సొంతం చేసుకుంది. జీరో సైజ్ నడుమును చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తెక్కించే ఫోజులతో గుండెల్లో గంటలు మోగించింది. ఫ్యాన్స్ ఈ బ్యూటీ పిక్స్ కి లైక్స్, కామెంట్లు పెడుతూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.
 

Latest Videos

click me!