మహేశ్ బాబు - రాజమౌళి సినిమా అప్డేట్.. మూడు నెలలు బ్యాంకాక్ కు సూపర్ స్టార్? ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

First Published | Jul 12, 2023, 6:48 PM IST

ఎస్ఎస్ రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో భారీ అడ్వెంచర్ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఎప్పటికప్పుడు విజయేంద్ర ప్రసాద్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. 
 

‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచాన్ని మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli). ఈ భారీ బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన్న మహేశ్ బాబు తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. చిత్రాన్ని భారీ స్కేల్లో, హాలీవుడ్ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 
 

SSMB29 చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా, సినిమా గురించి ఎప్పటికప్పుడు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నారు. ఇప్పటికే భారీ అడ్వెంచర్ గా రాబోతుందని, మహేశ్ బాబు మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలడని హైప్ పెంచిన విషయం తెలిసిందే. 
 


మరికొద్దిరోజుల్లో చిత్రంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్న తరుణంలో తాజాగా క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. మహేశ్ బాబు ‘ఎస్ఎస్ఎంబీ29’ ఇక ఫోకస్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం మూడు నెలలు బ్యాంకాక్ కు వెళ్లనున్నారంట. 

భారీ అడ్వెంచర్ ఫిల్మ్ కావడంతో యాక్షన్, స్టంట్స్ కు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. ఇందుకోసం మహేశ్ బాబు స్పెషల్ ట్రెయినింగ్ తీసుకోబోతున్నారంట. అది కూడా బ్యాంకాక్ లో 90రోజుల పాటు ఉంటుందని అంటున్నారు. 
 

ఈ ట్రైయినింగ్ లో మహేశ్ బాబు అడ్వాన్స్ మార్షల్ ఆర్ట్స్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి అంశాలపై శిక్షణ పొందనున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే మహేశ్ బాబు తన బాడీని ఉక్కులా మార్చేశారు. నిత్యం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ బీస్ట్ అవతార్ లోకి మారిపోతున్నారు. త్వరలోనే బ్యాంకాక్ కు వెళ్లబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
 

ఇప్పటికే ఈ చిత్రం పూజాకార్యక్రమం జరగాల్సి ఉండేది.  కానీ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, తదితర అంశాల కారణంగా కాస్తా ఆలస్యం అయినట్టు కనిపిస్తోంది. ఇక అతికొద్దిరోజుల్లోనే సినిమాను గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మహేశ్ త్రివిక్రమ్ సినిమాను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. 
 

Latest Videos

click me!