డిసెంబర్ 1న భారతీయ ప్రధాన భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుండటంతో మరింతగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక రష్మిక తనవంతుగా ఇలా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ప్రచారం చేస్తోంది. రష్మిక చేతిలో ఉన్న మరో బిగ్ ప్రాజెక్ట్ ‘పుష్ప2 : ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక శ్రీవల్లిగా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.