సందీప్ రెడ్డి వంగా 'అర్జున్ రెడ్డి' లాంటి కల్ట్ మూవీ అందించి తన ప్రత్యేకత చాటుకున్నారు. దీనితో సందీప్ తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా యువత సందీప్ తెరకెక్కించబోయే చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సందీప్.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో యానిమల్ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.