సాయిపల్లవి విషయంలో తెలివిగా తప్పించుకున్న రష్మిక.. కానీ అడ్డంగా దొరికిపోయిన కీర్తిసురేష్‌..హాట్‌ టాపిక్‌

Published : Feb 28, 2022, 05:23 PM ISTUpdated : Feb 28, 2022, 05:28 PM IST

సహజమైన అందం, సహజమైన నటనతో మెప్పిస్తూ విశేష అభిమానాన్ని ఏర్పర్చుకున్నసాయిపల్లవి ఇప్పుడు `మహానటి` కీర్తిసురేష్‌ని, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాని బాగా ఇరకాటంలో పెట్టింది.

PREV
18
సాయిపల్లవి విషయంలో తెలివిగా తప్పించుకున్న రష్మిక.. కానీ అడ్డంగా దొరికిపోయిన కీర్తిసురేష్‌..హాట్‌ టాపిక్‌

సాయిపల్లవి ఎంత్తైనా బ్యూటీఫుల్‌ యాక్టర్‌. అయితే ఇతర హీరోయిన్ల అంత కాకపోయినా సహజంగా ఉంటుంది. ఆమె అందమే కాదు, మాట, నటన కూడా అంతే సహజంగా ఉంటుంది. నిజాయితీగా ఉంటుంది. డాన్సు చేస్తే కుర్రాళ్లకి పిచ్చెక్కిపోవాల్సిందే. అద్బుతమైన డాన్సులతో ఫిదా చేస్తుంది. `లవ్‌ స్టోరీ` చిత్రంలో ఆమె చేసిన డాన్సులకు విశేష ప్రశంసలు దక్కాయి. అంతేకాదు చిరంజీవి సైతం సాయిపల్లవితో డాన్సు చేయాలని ఉందని తన కోరికని వెల్లడించారంటే సాయిపల్లవి రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 

28

ఇవన్నీ సాయిపల్లవిని టాప్‌ పొజిషిన్‌లో నిలిపాయి. దీనికి తోడు ఆమె కమర్షియల్‌ యాడ్‌ కూడా రిజక్ట్ చేసిందట. అలా చేయాలంటే గొప్ప మనసు ఉండాలని, తనలో గొప్ప మానవత్వం ఉందని ప్రశంసించారు సుకుమార్‌. ఆదివారం రాత్రి జరిగిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గెస్ట్ గా వచ్చిన సుకుమార్‌ ఈ విషయాన్ని చెప్పి ఆమెని ఆకాశానికి ఎత్తేశాడు. గొప్ప నటి అంటూ కొనియాడారు. 

38

అయితే ఇందులోనే సాయిపల్లవి గురించి సుకుమార్‌ చెప్పేముందు ఆడియెన్స్ విపరీతంగా అరుస్తూ కేకలు పెట్టడం విశేషం. సాయిపల్లవికి ఉన్న ఇమేజ్‌ని, క్రేజ్‌ని అభిమానులు అలా గట్టిగా అరుస్తూ హోరెత్తించారు. దీనికి స్టేజ్‌పై ఉన్న అంతా షాక్‌ అయ్యారు. దర్శకుడు సుకుమార్‌ కూడా కాసేపు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వారి అరుపులను చూసి `ఐ థింక్‌ లేడీ పవన్‌ కళ్యాణ్‌అనుకుంటా` అంటూ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం ఇప్పుడు ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతుంది. దీనిపై నెటిజన్లు మీమ్స్ చేసి సాయిపల్లవిని ట్రెండ్‌ చేస్తున్నారు. ఆమె రేంజ్‌ని తెలియజేస్తున్నారు. 

48

అయితే ఇక్కడే ఇద్దరు స్టార్‌ హీరోయిన్లకి అసూయ పుట్టించింది. స్టేజ్‌పై ఉన్న కీర్తిసురేష్‌, రష్మిక మందన్నాలు కూడా సాయిపల్లవికి ఉన్న క్రేజ్‌ని చూసి షాక్‌కి గురయ్యారు. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. 
 

58

కానీ ఈ విషయంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా తెలివిగా తప్పించుకుంది. సాయిపల్లవి పేరు చెప్పినప్పుడు అభిమానులు అరుస్తున్న విధానాన్ని నవ్వుతో కవర్‌ చేసుకుంది. కెమెరా కళ్లు ఆమెనే ఫోకస్‌ చేస్తున్న నేపథ్యంలో తనలోపలి జెలసీని బయట పడకుండా కవర్‌ చేసుకుంది. సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోయింది. తాజాగా ఈ విషయం గురించి మాట్లాడుతూ సాయిపల్లవి ఇంత తక్కువ సమయంలో ఆ స్థాయి ఇమేజ్‌ని, క్రేజ్‌ని సొంతం చేసుకోవడం గొప్ప విషయమని ప్రశంసించింది. 

68

 ఈ విషయంలో మాత్రం `మహానటి` కీర్తిసురేష్‌ అడ్డంగా బుక్కయ్యింది. సాయిపల్లవి కోసం ఆడియెన్స్ అరుస్తుండగా, మొదట స్మైల్‌ ఫేస్‌తో కనిపించిన కీర్తి.. ఆ తర్వాత ఆమె ఫేస్‌లో ఎక్స్ ప్రెషన్స్ మారిపోయాయి. జెలసీ ఫీలింగ్‌లోకి వెళ్లిపోయింది. ఈ వీడియోలను, ఫోటోలను క్యాప్చర్‌ చేసిన నెటిజన్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. 

78

సాయిపల్లవి క్రేజ్‌కి కీర్తిసురేష్‌ జెలసీగా ఫీలవుతుందంటూ, తట్టుకోలేకపోయారంటూ ఆయా వీడియోలను, ఫోటోలను మీమ్స్ రూపంలో షేర్‌ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. సాయిపల్లవి ముందు కీర్తి అడ్డంగా దొరికిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు నెట్టింట పెద్ద రచ్చగా మారడం గమనార్హం. 
 

88

ఇటీవల `లవ్‌ స్టోరి`, `శ్యామ్‌ సింగరాయ్‌` సక్సెస్‌లో ఫుల్‌ జోష్‌లో ఉంది సాయిపల్లవి. ఈ రెండు చిత్రాల్లో ఆమె నటనకు, డాన్సులకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం సాయిపల్లవి `విరాటపర్వం`లో నటిస్తుంది. అలాగే విజయ్‌తో తెలుగు సినిమా, శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తుంది. కీర్తిసురేష్‌ `సర్కారు వారి పాట`, `భోళాశంకర్‌`, `దసరా` చిత్రాలు చేస్తుంది. తమిళంలో ఓ చిత్రం, మలయాళంలో మరో సినిమాలో నటిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories