Gangubai Khathiawadi Collections : బాక్సాఫీస్ వద్ద ‘గంగూబాయి కతియావాడి’సందడి.. మూడు రోజుల కలెక్షన్స్ ఇలా..

Published : Feb 28, 2022, 05:03 PM IST

‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ  అలియా భట్ (Alia Bhatt) నటించిన ‘గంగూబాయి కతియావాడి*  మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ నెల 25న రిలీజ్ అయిన  ఈ చిత్రం మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ ను వసూల్ చేస్తోంది.  

PREV
16
Gangubai Khathiawadi Collections : బాక్సాఫీస్ వద్ద ‘గంగూబాయి కతియావాడి’సందడి.. మూడు రోజుల కలెక్షన్స్ ఇలా..

బాలీవుడ్‌ యంగ్‌ స్టార్  అలియా నటించిన ప్రయోగాత్మక  సినిమా గంగూబాయ్ కతియావాడి (Gangubai Kathiawadi) . ఫేమస్ రైటర్  హుస్సేన్‌ జైదీ రాసిన మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై అనే నవల  ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అన్ని అడ్డకులను తొలగించుకొని ఫిబ్రవరి 25 ఈ మూవీ రిలీజ్ అయ్యింది.  
 

26

గంగూబాయ్ కతియావాడి సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించారు. ఈసినిమాను  డైరెక్టర్ చేయడంతో పాటు పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌ జయంతీలాల్‌ గడతో కలిసి నిర్మించారు. ఈ సినిమాలో గంగూ బాయ్ గా అలియా భట్ నటించింది. గంగూబాయి గా అలియాను పోష్టర్స్ లో చూసిన ఆడియన్స్ ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూశారు.
 

36

ఇదివరకే రిలీజైన ట్రైలర్‌, సినిమాపై చుట్టుకున్న వివాదాలు అలియా సినిమాకు హైప్‌ తీసుకొచ్చాయి. అయితే ఈ సినిమాలో తన తల్లి గంగూబాయ్‌ కథియావాడీని వేశ్యగా చూపించారంటూ ఆమె తనయుడు బాబూ రావుజీ షా కోర్టుకు వెళ్లారు. సినిమా రిలీజ్ కూడా ఆపేయాలని ప్రయత్నించినా.. సినిమా విడుదలపై స్టే విధించేందుకు కోర్డ్ నిరాకరించింది. 
 

46

అలాగే మహారాష్ట్ర ఎమ్మెల్యే కూడా కతియావాడి ప్రాంతానికి చెందిన  వాడిగా ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలను, తమ ప్రాంత పేరు వినియోగించినందున అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరును తొలగించాలంటూ.. లేదంటే తమ ప్రాంత ప్రజలను అవమానించినట్టే అవుతుందని కోర్టును ఆశ్రయించినా.. విడుదలను ఆపలేకపోయారు. దీంతో ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది.
 

56

అయితే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే నాలుగు రోజులు గడుస్తోంది. హిందీ, తెలుగులో రిలీజ్ చేశారు. గంగూబాయి కతియావాడి తొలిరోజు ఫిబ్రవరి 27న  దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.10.50 కోట్లు రాబట్టింది. రెండో రోజు  ఫిబ్రవరి 28న రూ.13.32 కోట్లు వసూలు చేసింది. మూడవ రోజు రూ. 15.30 కోట్లు వసూలు చేసింది, మొత్తంగా దేశీయ వారాంతపు వసూళ్లు రూ.39.12 కోట్లకు చేరుకుంది.  
 

66

ముంబై, థానే, పూణె, గుజరాథ్, ఢిల్లీ, సౌత్ ఇండియాలో ‘గంగూబాయి రోజు రోజుకు పుంజుకుంటోంది. సాలిడ్ కలెక్షన్స్ తో బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. మరోవైపు మూవీ రిలీజ్ నాటికి ఈ చిత్రం భారతదేశంలో రూ.46.57 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.10.51 కోట్లు వసూలు చేసింది.   ప్రపంచవ్యాప్తంగా రూ.57.08 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను సాధించింది. వీకెండ్ ఆదివారం మాత్రం  40 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీలో వృద్ధిని సాధించింది. బాక్సాఫీస్ ఇండియా లెక్కల ప్రకారం ఢిల్లీలో నైట్ షోలు కూడా ఫుల్ అవుతున్నాయి.

click me!

Recommended Stories