పాపులర్ ఇండియన్ సెలబ్రెటీగా రష్మిక మందన్న.. IMDb జాబితాలో నేషనల్ క్రష్ కు మూడో స్థానం

First Published | Apr 15, 2023, 4:38 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)  క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ప్రముఖ IMDb సంస్థ వెల్లడించిన పాపులర్ ఇండియన్ సెలబ్రెటీల జాబితాలో చోటు దక్కించుకుంది.  
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న క్రేజ్ అంతకంతకూ పెరిగపోతోయింది. సౌత్, నార్త్ లో బడా స్టార్స్ సరసన నటిస్తూ టాప్ లిస్టుల్లో చోటు దక్కించుకుంది. దీంతో నేషనల్ క్రష్ గా మారి ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా మరో ఘనతను సాధించింది.
 

రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ లలోనూ నటిస్తుండటంతో ఈ బ్యూటీ క్రేజ్ తారాస్థాయిలో ఉంది. సౌత్, నార్త్ లో సందడి చేస్తూ వస్తోంది. 


విపరీతమైన జనాదరణ పెరుగుతుండటంతో ఈ వారం ప్రముఖ IMDb సంస్థ వెల్లడించిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్‌లో చోటుదక్కించుకుంది. ఏకంగా భారతదేశంలో మూడోవ అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీగా నిలిచింది. దీంతో రష్మిక ఫ్యాన్స్ ఫుల్ కుషి అవుతున్నారు. 
 

గత వారంలో రష్మిక పుట్టినరోజు రావడం, ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లోనూ ఈ బ్యూటీ సందడి చేసిన విషయం తెలిసిందే. దీంతో రష్మిక మందన్న పేరు మారుమోగింది. ఈక్రమంలో మరింత జనాదరణ పొందిన నటిగా క్రేజ్ దక్కించుకుంది. ఇక వరుసగా రష్మిక ప్రాజెక్ట్స్ ను కూడా ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక జంటగా నటిస్తున్న ‘పుష్ప’ వీడియో కూడా రావడం, శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కావడంతో రష్మిక పేరు నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈక్రమంలో శ్రీవల్లి మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రెటీగా మారింది. ఇందుకు రష్మిక సంతోషం వ్యక్తం చేసింది.
 

ప్రస్తుతం రష్మిక భారీ ప్రాజెక్ట్స్ లలో నటిస్తోంది. తెలుగు ‘పుష్ప2’తో పాటు నితిన్ సరసన VNRTrioలోనూ నటించబోతోంది. ఇక రీసెంట్ గా ‘రెయిన్ బో’ అనే చిత్రాన్ని కూడా ప్రకటించి ఆకట్టుకుంది. మరోవైపు బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్న శ్రీవల్లి.. ప్రస్తుతం రణబీర్ కపూర్ సరసన ‘యానిమల్’లో నటిస్తోంది.
 

Latest Videos

click me!