కనిపించకుండా పోయిన ప్రేమ కథా చిత్రం హీరోయిన్ నందితా రాజ్, ఇప్పుడేం చేస్తుందంటే..?

Published : Apr 15, 2023, 03:48 PM ISTUpdated : Apr 15, 2023, 03:53 PM IST

నందితా రాజ్ గుర్తుందా.. పెద్ద పెద్ద కళ్లు.. చబ్బి బుగ్గలు.. బొద్దుగా ఉన్నా.. క్యూట్ గా ఉండే ఆ హీయిన్ ను.. తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఇంతకీ ఇప్పుడు ఈ హీరోయిన్ ఏమైపోయింది. ఎక్కడా కనిపించడంలేదు.. ఇప్పుడేం చేస్తోంది.   

PREV
17
కనిపించకుండా పోయిన ప్రేమ కథా చిత్రం హీరోయిన్ నందితా రాజ్, ఇప్పుడేం చేస్తుందంటే..?

పెద్ద పెద్ద కళ్ళతో.. అందమైన రూపంతో..ఆడియన్స్ ను అలరించిన హీరోయిన్ నందితా రాజ్.. చూడగానే ఇట్టే ఆకట్టుకునే నవ్వు ముఖంతో.. కుర్రాళ్ళను ఆకర్షించిన నందితా..సుధీర్ బాబుతో నటించిన ప్రేమకథా చిత్రమ్‌  సినిమాలో అందరినీ భయపెట్టింది.అవే పెద్ద పెద్ద అందమైన కళ్ళతో  పరుగులు పెట్టించింది నందితా రాజ్‌. 
 

27

మారుతి దర్శకత్వంలో సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం మంచి హిట్ ను అందుకుంది.  సినిమా సూపర్‌హిట్‌గా నిలిచినా.. అది నందితాకు మాత్రం ఏమాత్రం ఉపయోగపడలేదు. కాని  డైరెక్టర్‌గా మారుతికి, హీరోగా సుధీర్‌బాబుకి మంచి బ్రేక్‌ మాత్రం వచ్చింది. కాకపోతే ఈ సినిమా ప్రభావంతో నందితకు అవకాశాలు వచ్చినా.. వాటినిసరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో.. హీరోయిన్ గా నిలవడలేకపోయింది బ్యూటీ. 

37

ఇక ప్రేమ కథా చిత్రం సినిమాలో నందిత పెర్ఫామెన్స్ పీక్స్.. ఇక ఈ సినిమాలో అందం, అభినయం పరంగా ఫుల్‌ మార్కులు కొట్టేసింది నందిత. దెయ్యంగా సప్తగిరికి చుక్కలు చూపించే పాత్రలో ఆమె నటన ఇప్పటికీ ఆడియన్స్ తలుచుకుని నవ్వుకుంటారు. అంతలా ప్రభావంచూపింది నందిత. 

 

47

తేజ డైరెక్షన్‌లో వచ్చిన నీకు నాకు డ్యాష్‌ డ్యాష్‌ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నందిత. ప్రేమకథా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత లవర్స్‌, రామ్‌లీలా, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, శంకరా భరణం, సావిత్రి లాంటి ఎన్నో సినిమాల్లో నటించింది కాని ఏ సినిమా తనను హీరోయిన్ గా నిలబెట్టలేదు. 
 

 

57

అందం తక్కువ లేదు.. నటనలో కూడా నిరూపించుకుంది. అన్నిటికి మించి టాలెంట్ కూడా ఉంది. కాని ఆమె సెలక్ట్ చేసుకున్న కథలు కెరీర్ పరంగా నందితను దెబ్బతీశాయి. దాంతో తాను చేసిన సినిమాల వల్ల స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోలేకపోయిందీ తెలుగమ్మాయి. ఆతరువాత క్యారెక్టర్ రోల్స్ చేసుకోవల్సి వచ్చింది. 

67

ఇక అవకాశాలు తగ్గడంతో ఎన్టీఆర్‌ జై లవకుశ, కథలో రాజకుమారి సినిమాల్లో క్యామియో రోల్స్‌లో కనిపించిన నందిత 2019 చివరిగా విశ్వామిత్ర అనే సినిమా చేసింది. కాని ఈసినిమా కూడా ఆమెను నిలబెట్టలేకపోయింది. దాంతో పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. విశ్వామిత్ర సినిమా తర్వాత పత్తాలేకుండా పోయింది నందిత. 

77

చాలా మంది హీరోయిన్లు సినిమాల నుంచి దూరం అయినాసోషల్ మీడియాలో ప్యాన్స్ ను పెంచుకుంటారు. కాని నందిత రాజ్ మాత్రం సోషల్ మీడియాలో కూపెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. వెబ్ సిరీస్‌లో నటించబోతుంది నందితా అని టాక్ వచ్చింది. కాని అది కూడా పుకారే అని తెలిసింది. అయితే ఆమె మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. దాంతో మళ్ళీ మోడలింగ్ వైపు వెళ్ళినట్టు తెలుస్తోంది. ముందు ముందు ఎవరైనా దర్శకుడికి గుర్తుకు వచ్చి... మళ్ళీ నందితరాజ్ ను తెరమీదకు తీసుకువస్తారేమో చూడాలి. 

click me!

Recommended Stories