Rajamouli: ఒక్క సినిమాకు రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? పాన్ ఇండియా హీరోలకన్నా ఎక్కువ

Published : Feb 04, 2026, 11:04 AM IST

Rajamouli: మన దేశంలోనే టాప్ దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆయన ఒక్క సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్టార్ హీరో కన్నా ఎక్కువ. 

PREV
14
ఒక్క సినిమాకు ఎంత?

సినిమా చరిత్రలో తనకంటూ మంచి గుర్తింపును, స్టార్ డమ్ ను సంపాదించుకున్న దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఇప్పుడు మనదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడిగా ఆయన పేరే చెబుతారు. ఒక్క సినిమా కోసం రాజమౌళి తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పాన్ ఇండియన్ స్టార్ హీరో తీసుకునే పారితోషికం కన్నా రాజమౌళి తీసుకునే డబ్బే ఎక్కువ. ఇప్పడు మనదేశంలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడు ఇప్పుడు రాజమౌళి. ఆయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.200 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆయన కష్టం ఎంతో ఉంది. చిన్న సినిమాలతో మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు ఆస్కార్ వరకు చేరింది. ఇండియన్ సినిమా సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి చేరేందుకు ఆయన ఎంతో కష్టపడ్డాడు.

24
రాజమౌళి చేసిన సినిమాలు

రాజమౌళి చేసిన సినిమాల్లో ఎన్నో సక్సెస్ అయ్యాయి. ముందుగా చెప్పుకోవాల్సింది స్టూడెంట్ నెం.1 గురించే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించారు. అతడిని కూడా హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. ఆ తరువాత సింహాద్రి సినిమాతో మరో భారీ హిట్ కొట్టాడు. ఇక విక్రమార్కుడు, యమదొంగ, మగధీర వంటి సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్‌ను భారీగా షేక్ చేశాయి. ముఖ్యంగా మగధీర సినిమా అతడిని మంచి స్థాయికి చేర్చింది. వంద కోట్ల కలెక్షన్ అప్పట్లో తెచ్చిన సినిమా ఇది. దీంతో ఆయన సక్సెస్ ఫుల్‌గా దర్శకుడిగా మారారు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవి ఇండియన్ సినిమా చరిత్రనే మార్చేశాయి. ఈ సినిమాలే రాజమౌళిని దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడిగా మార్చాయి.

34
మిగతా దర్శకులు ఎంత తీసుకుంటారు?

రాజమౌళి తర్వాతి మరికొందరు దర్శకుల అత్యధిక పారితోషికం తీసుకుంటారు. యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా ఫేమ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఆయన ప్రస్తుతం ఒక సినిమాకు సుమారు రూ.100 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక అట్లీ కూడా ఒక సినిమాకు దాదాపు రూ.100 కోట్లు ఛార్జ్ చేస్తున్నారని సమాచారం. కేజీఎఫ్, సలార్ వంటి భారీ హిట్లను అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈయన కూడా ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు పారితోషికంగా తీసుకుంటారు. ఇక బాలీవుడ్ దర్శకులు రాజ్ కుమార్ హిరానీ ఒక్క సినిమాకు సుమారు రూ.80 కోట్లు ఛార్జ్ చేస్తారని సమాచారం.

44
సుకుమార్ ఎంత తీసుకుంటారు?

ఇక టాలీవుడ్‌లో మరో క్రేజీ దర్శకుడు సుకుమార్ ఒక సినిమాకు సుమారు రూ.75 కోట్లు తీసుకుంటారని చెప్పుకుంటారు. పుష్ప సినిమాతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. స్టార్ దర్శకుల జాబితాలో ఆయన మొదటి స్థానంలో ఉంటారు. ఇక బాలీవుడ్ దర్శకులు సంజయ్ లీలా భన్సాలి ఒక్క సినిమాకు దాదాపు రూ.65 కోట్లు తీసుకుంటున్నారు. తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరార్ ఒక్కో సినిమాకు రూ.60 కోట్లు పారితోషికం లభిస్తోంది. ఇక దర్శకుడు శంకర్ ఒక సినిమాకు సుమారు రూ.50 కోట్లు తీసుకుంటారని సమాచారం. ఈ లెక్కలన్నీ చూస్తే రాజమౌళిని కొట్టే దర్శకులే కనిపించడం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories