చీరలో ఇంత వయ్యారంగా పోజులిస్తే కుర్రాళ్ల కొంప కొల్లేరే.. నేషనల్‌ క్రష్‌ న్యూ ఇయర్‌ సందేశం..

Published : Dec 30, 2022, 08:20 PM ISTUpdated : Dec 30, 2022, 08:22 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా అందాలను చూపించడంలో హద్దులు చెరిపేస్తూ తరచూ హాట్‌ టాపిక్ అవుతుంటుంది. సోషల్‌ మీడియాలో తరచూ రచ్చ చేసే ఈ భామ ఇప్పుడు ఇయర్‌ సందర్భంగా కట్టిపడేస్తుంది.   

PREV
16
చీరలో ఇంత వయ్యారంగా పోజులిస్తే కుర్రాళ్ల కొంప కొల్లేరే.. నేషనల్‌ క్రష్‌ న్యూ ఇయర్‌ సందేశం..

రష్మిక మందన్నా తాజాగా చీరలో మెరిసింది. చీరకట్టి వయ్యారంగా పోజులిచ్చింది. సోకుల సునామీ సృష్టించింది. చిలిపి పోజులతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతుంది. ఇయర్‌ ఎండ్‌ సందర్భంగా కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. పిచ్చెక్కించే పోజులతో నెట్టింట దుమారం రేపుతుంది. 
 

26

రష్మిక మందన్నా పంచుకున్న నయా ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా రష్మిక న్యూయర్‌ సందేశాన్ని ఇచ్చింది. పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, కొత్త ఏడాకి స్వాగతం పలికింది. అభిమానుల ప్రేమ కోరుకుంటున్నట్టు తెలిపింది. 
 

36

ఇందులో రష్మిక చెబుతూ, `ఈ రోజు చాలా ప్రేమ కురిపించడాన్ని నేను చూశా. అది నాకు చాలా కృతజ్ఞతగా అనిపించేలా చేసింది. ఈ ప్రేమలకు ధన్యవాదాలు. 2022కి చివరి కొన్ని రోజులున్నాయి. అదే సమయంలో కొత్త ఏడాదిలోకి మీ అందరి ప్రేమ మాత్రమే ఉంటుందని ఆశిస్తున్నా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మంచి ఆరోగ్యం, ఆనందం ఉండాలని కోరుకుంటున్నా` అని పేర్కొంది రష్మిక. 
 

46

రష్మిక మందన్నా క్రేజ్‌, పాపులారిటీ, సినిమా అవకాశాల విషయంలో ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. ఆమె అటు బాలీవుడ్‌, ఇటు కోలీవుడ్‌, టాలీవుడ్‌ని చుట్టేస్తుంది. తెలుగులో రష్మిక `పుష్ప2`లో నటిస్తుంది. హిందీలో `యానిమల్‌` చిత్రంలో, తమిళంలో `వారసుడు` చిత్రంలో నటిస్తుంది. ఈ సంక్రాంతికి `వారసుడు` చిత్రం రిలీజ్‌ కాబోతుంది. 

56

రష్మికకి `పుష్ప` చిత్రం నేషనల్‌ వైడ్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. పాన్‌ ఇండియా హీరోయిన్‌లా మారింది. `శ్రీవల్లి`గా ఆమె చేసిన రచ్చ మామూలు కాదు. అంతేకాదు అందులోని `సామి.. రారా సామి` పాట సైతం పాపులర్‌ అయ్యింది. రష్మిక స్టెప్పులు ఆకట్టుకున్నాయి. 

66

ఇదిలా ఉంటే ఇటీవల వరుసగా వివాదాల్లోనూ ఇరుక్కుంటుంది రష్మిక. ఆ మధ్య కన్నడ సినిమాలపై, `కాంతార` సినిమా విషయంలోనూ వివాదంలో ఇరుక్కుంది. ఏకంగా ఆమెని కన్నడ పరిశ్రమ నుంచి బ్యాన్‌ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. మరోవైపు లేటెస్ట్ గానూ మరో వివాదంలో ఇరుక్కుంది. రొమాంటిక్‌ సాంగ్స్ విషయంలో బాలీవుడ్‌లోనే రొమాంటిక్ పాటలను చూశానని, సౌత్‌లో అన్నీ మాస్‌ మసాలా పాటలే ఉంటాయంటూ వ్యాఖ్యానిచ్చింది. దీంతో సౌత్‌ ఆడియెన్స్, మేకర్స్ రష్మికపై విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదంలో రష్మిక హాట్‌ టాపిక్‌ అవుతుంది.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories