ప్రస్తుతం బుల్లితెర నటులు,జబర్దస్త్ కమెడియన్లు న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్స్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే జబర్దస్త్ టీం మాత్రం ఒక స్పెషల్ ఎపిసోడ్ తో సిద్ధం అవుతోంది. తెలుగులో పాపులర్ కామెడీ షోగా దూసుకుపోతున్న జబర్దస్త్ త్వరలో అరుదైన మైలురాయి అందుకోబోతోంది. జనవరి 5న జబర్దస్త్ 500 వ ఎపిసోడ్ ప్రసారం కానుంది.