పెంపుడు కుక్కకు బిజినెస్ క్లాస్ ప్లైట్ టికెట్ కావాలట, రష్మిక మందన్న నిర్మాతలకు వింత డిమాండ్..?

Published : Jun 25, 2022, 11:42 AM ISTUpdated : Jun 25, 2022, 11:43 AM IST

ఈ మధ్య నేష‌న‌ల్ క్ర‌ష్‌ ర‌ష్మిక  తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. త‌న క్యూట్‌నెస్‌తో పాటు గ్లామ‌ర్ షో తో పాటు హాట్ టాపిక్‌గా నిలుస్తుంటుంది.  అయితే ఈ అమ్మడు తాజాగా త‌న పెట్ డాగ్ విష‌యంలో హాట్ టాపిక్ అయ్యింది. ప్ర‌స్తుతం ఈ విష‌యం నెట్టింట వైర‌ల్‌గా మారింది.  

PREV
17
పెంపుడు కుక్కకు బిజినెస్ క్లాస్ ప్లైట్ టికెట్ కావాలట, రష్మిక మందన్న నిర్మాతలకు  వింత డిమాండ్..?

తెలుగుతో పాటు హిందీ, త‌మిళంలోను ప‌లు ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటుంది రష్మిక మందన్నా. అంతే కాదు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ కూడా అవుతోంది. ఈమధ్య  నిర్మాతలను హీరోయిన్లు ఎలా సతాయిస్తాన్నారో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎంత ఎక్కువ డిమాండ్ ఉంటే వారి అంతగా డిమాండ్లు కూడా ఉంటాయి వారి నుంచి. ఇప్పుడు రష్మిక కూడా ఇలానే మారిపోయినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఆమె వింత కోర్కెలు కోరుతున్నట్టు సమాచారం. 

27

ఇప్పుడు  బాగా డిమాండ్ ఉన్న హీరయిన్లలో  రష్మిక మందన్న కూడా ఉన్నారు. ఆమెతో సినిమా అంటే  త‌నకు తన సిబ్బందికి బిజినెస్ క్లాస్ టిక్కెట్లు మరియు ఫైవ్ స్టార్ వసతిని నిర్మాతల వద్ద డిమాండ్ చేయడం కామన్ గా మారింది. అయితే రష్మిక ఓ అడుగు ముందుకేసి తన పెంపుడు కుక్క కోసం కూడా విమాన టిక్కెట్లు డిమాండ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

37

రష్మిక త‌న పెట్ డాగ్ లేకుండా ఉండ‌లేకపోతోందంట. ఈ క్ర‌మంలో ర‌ష్మిక తాను ఎటు వెళ్లిన పెట్ డాగ్ ఉండాలంటుంది. అయితే పెట్ డాగ్ ఫ్లైయిట్ ఎక్కించే క్ర‌మంలో ఖ‌ర్చు భారీగానే అవుతుంది. సాధారణంగా, నిర్మాతలు తక్కువ ధరకు విమానాల్లో టిక్కెట్లను బుక్ చేయడం ద్వారా డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నిస్తారు.కాని ఇప్పుడు పెంపుడు కుక్క ద్వారా లేని పోని స‌మ‌స్య ఎదుర్కొంటున్నారు.
 

47

అన్ని విమానయాన సంస్థలు పెంపుడు జంతువులను విమానంలో అనుమతించవు. తద్వారా విమానాల టైమింగ్స్ మరియు తదనుగుణంగా ఆమె షెడ్యూల్‌ను ప్లాన్ చేయడం ప్రతిదీ కష్టంగా మారుతుంది, కానీ వారు స్టార్ హీరోయిన్‌తో పెట్ట‌కుంటే క‌ష్టాలు ఇలానే ఉంటాయని అంటున్నారు. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలి. ఈ విషయంలో స్పందించింది రష్మిక.
 

57

ఈ మధ్య ఎక్కడ చూసిన తన కుక్క పిల్లతో కనిపిస్తోంది రష్మిక. హైదరాబాద్, బెంగళూరు, ముంబయి.. ఇలా ఎక్కడికెళ్లినా తన కుక్కపిల్లను మాత్రం వదలడం లేదు. ఆమధ్య ఛార్మి-రష్మిక కలిసి తమ కుక్కలతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ తర్వాత సీనియర్ నటి రాధిక-రష్మిక కూడా కుక్కపిల్లలతో దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. 

67

రష్మిక పెట్ డాగ్ పేరు ఆరా. విషయంలో తాను డిమాండ్ చేస్తున్నాను అని వస్తున్న వర్తలపై స్పందించింది రష్మిక. కిందపడి దొర్లి మరీ నవ్వుతున్నట్టు ఉన్న ఎమోజీలు జత చేసిన రష్మికా.. ఇందులో ఏటువంటి నిజం లేదన్నట్టు ట్వీట్ చేసింది. తన పెంపుడు కుక్క తనతో ప్రాయణం చేయడానికి ఇష్టపడదని.. ఇలాంటి ప్రచారాలు మానుకోవాలి అని సున్నితంగా హెచ్చరించింది. 
 

77

తన డాగ్ హైదరాబాద్ లో సేఫ్ గా ఉందని.. ఈ విషయంలో మీరు ఆంధోళణ  చెందవద్దు అంటూ.. వెంటకారంతో కూడిన నవ్వుతో రష్మిక  ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ తో పాటు.. ఆ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. 

click me!

Recommended Stories