బాయ్ ఫ్రెండ్ తో ప్రియాంక జవాల్కర్.. హార్ట్ ఎమోజీతో ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పక్కా ఆ క్రికెటరే అంటున్న నెటిజన్స్.

Published : Jun 25, 2022, 11:19 AM ISTUpdated : Jun 25, 2022, 11:20 AM IST

టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ తన భాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే  ఆ వ్యక్తి ఇండియన్  క్రికెటరే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.    

PREV
18
బాయ్ ఫ్రెండ్ తో ప్రియాంక జవాల్కర్.. హార్ట్ ఎమోజీతో ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పక్కా ఆ క్రికెటరే అంటున్న నెటిజన్స్.

తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar)కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. తొలి రెండు చిత్రాలతోనే కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయిన హీరోయిన్ ఈమె. అందం, అభినయంలో ప్రియాంక స్టార్ హీరోయిన్లతో పోటీపడుతోంది. 
 

28

తన తొలి చిత్రం ‘కలవరమాయే’తో టాలీవుడ్ కు  హీరోయిన్ గా పరిచయం అయ్యింది ప్రియాంక. 2017లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి సంపత్ వి. కుమార్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో కలిసి ‘టాక్సీవాలా’లో మెరిసింది.

38

విజయ్ సరసన నటించిన ఈ బ్యూటీ కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలోనూ బోల్డ్ గా, హాట్ గా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తన పెట్టే పోస్ట్ లకు కుర్రాళ్లు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. తన అందాన్ని, ఫ్యాషన్ సెన్స్ ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. 

48

అయితే తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన పిక్స్ గా  తెలుస్తోంది. ఓ రెస్టారెంట్ లో ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్న ఉన్న ఫొటోను షేర్ చేసింది. కానీ తెలివిగా తన బాయ్ ఫ్రెండ్ ను బ్యాక్ నుంచి మాత్రం చూపించింది. ఆయన ఫొటోలు తీస్తుంటే క్యూట్ గా పోజులిచ్చిందీ బ్యూటీ.
 

58

తనతో ఫొటోలో ఉన్న వ్యక్తి ఇండియన్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యరే (Venkatesh Ayyar) అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బ్యాక్ నుంచి నెక్ భాగం అచ్చు వెంకటేశ్ లానే అనిపించడంతో పక్కా ఆయనే అంటూ మరికొద్దరు అభిప్రాయపడుతున్నారు. ఈపిక్స్ షేర్ చేస్తూ ప్రియాంక ‘అతనే లవ్’ అంటూ హార్ట్ ఎమోజీ వదులుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
 

68

గతంలోనూ ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోపై క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.  ఆ ఫొటోకు ‘క్యూట్’ అంటూ కామెంట్ చేయడంతో.. రిప్లైగా అయ్యర్ కామెంట్‌పై ‘ఎవరు? నువ్వా..’ అంటూ రిప్లై ఇచ్చింది. 
 

78

అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రియాంక చేసిన పోస్ట్, షేర్ చేసిన పిక్స్ కూడా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని కన్ఫమ్ చేస్తున్నాయి. సమయం ఉన్నప్పుడల్లా ఇలా హోటల్స్ లో కలుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే తమ రిలేషన్ షిప్ పై ఈ యంగ్ బ్యూటీ కానీ, వెంకటేష్ అయ్యర్ కానీ ఇంకా స్పందించలేదు. 
 

88

షేర్ చేసిన పిక్స్ లో  ప్రియాంక ట్రెడిషనల్ గా కనిపిస్తోంది. బ్లూ చుడీదార్ ధరించిన యంగ్ బ్యూటీ తొలిచూపులోనే ఆకర్షిస్తోంది. ఎద పైనుంచి చున్నీని పక్కకు జరిపి క్లీవేజ్ అందాలను దగ్గరగా చూపిస్తోంది. మత్తు చూపుతో పిచ్చెక్కిస్తోంది. హాట్ గా స్టిల్స్ ఇచ్చి నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆమె అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories