తమిళనాట స్టార్ హీరోగా వెలుగువెలుగుతున్న దళపతి విజయ్.. తాజాగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాజకియాలకు సినిమాగ్లామర్ మొదటినుంచి ఉన్నాదే. అసలు చెప్పాలంటే.. అక్కడ ప్రాంతీయ పార్టీలు స్టార్ట్ చేసిందే సినిమావాళ్లు. దాంతో తమిళరాజకీయంలో సినిమా భాగంగా ఉంది. ఇప్పటికే ఎమ్జీఆర్, జయలలిత, కరుణానిధి, విజయ్ కాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్, లాంటి స్టార్స్ రాజకీయాల్లో ఉన్నారు. ఇందులో కొంత మంది కాలం చేశారు కూడా.
Thalapathy vijay
ఈక్రమంలో తాజాగా మరో స్టార్ హీరో అయిన విజయ్ దళపతి కూడా తాజాగా ఓ పార్టీని ప్రకటించడం తెలిసిందే.. తమిళ వెట్రి కళగం’ పేరిట పార్టీని ప్రకటించారు. అయితే తన పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అదేవిధంగా ఏ పార్టీకి మా పార్టీ మద్దతివ్వట్లేదని విజయ్ ప్రకటించారు. ఇక వచ్చే అసెంబ్రీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీని చిన్నగా దార్తో పెట్టే పని స్టార్ట్ చేశాడు విజయ్ ఇక ఈ నేపథ్యంలో విజయ్ బాటలోనే తాజాగా మరో హీరో తమిళనాడు రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ నటుడు విశాల్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తమిళనాట టాక్ నడుస్తోంది. గతంలోనే విశాల్ కు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. స్వతంత్ర అభ్యర్ధిగా జయలలిత మరణం తరువాత ఆ స్థానంలో పోటీ చేయడానికి ట్రై చేశాడు. అప్పట్లో సంచలంగా మారింది ఈ విషయం. ఇక ప్రస్తుతం విశాల్ కూడా పార్టీ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం. పార్టీ ఏర్పాటుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
vishal
2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా రాజకీయ ఎంట్రీ ఉండబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. విశాల్ పొలిటికల్ ఎంట్రీపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తమిళనాట టాక్ వినిపిస్తోంది. అతి త్వరలోనే ఆయన తన పార్టీ పేరును కూడా ప్రకటించబోతున్నారని సమాచారం.కాగా, తమిళనాడు రాజకీయాలపై విశాల్ చాలా ఏళ్లుగా ఆసక్తిగా ఉన్నారు. గతంలో చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ నామినేషన్ కూడా వేశారు. అయితే, కొన్ని కారణాల రీత్యా ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. విశాల్ ప్రస్తుతం ‘విశాల్ పీపుల్స్ హెల్త్ మూమెంట్’ పేరుతో ప్రజలకు సేవ చేస్తున్న విషయం తెలిసిందే.
Tamil actor Vishal reveals about Vijay
చెన్నైలో వరదలు ఇతర విపత్తు సమయంలో ప్రజలను ఆదుకుంటున్నారు. అయితే, గతంలో ఓ సారి విశాల్ మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం. అయితే నా రాజకీయ ప్రవేశం ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను. సమాజసేవ చేసేందుకే రాజకీయాల్లోకి అడుగు పెడతా’ అని విశాల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయంగా తెలుస్తోంది.