విజయ్ దేవరకొండ ఫ్యామిలీ వెకేషన్ లో రష్మికకు పనేంటి? ఇండైరెక్ట్ హింట్ అనుకోవచ్చా, నెటిజన్స్ కామెంట్స్!

Published : Feb 02, 2023, 11:27 AM IST

విజయ్ దేవరకొండ-రష్మిక ఎఫైర్ ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఈ జంట మా మధ్య ఏం లేదంటూనే అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ వెకేషన్ లో రష్మిక జాయిన్ కావడం హాట్ టాపిక్ అయ్యింది.   

PREV
17
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ వెకేషన్ లో రష్మికకు పనేంటి? ఇండైరెక్ట్ హింట్ అనుకోవచ్చా, నెటిజన్స్ కామెంట్స్!
Vijay Devarakonda-Rashmika Mandanna

విజయ్ దేవరకొండ తన పేరెంట్స్ తో పాటు దుబాయ్ వెళ్లారు. ఫ్యామిలీతో పాటు ఓ ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేశారు. విజయ్ దేవరకొండ అమ్మానాన్నలతో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అనూహ్యంగా విజయ్ దేవరకొండతో రష్మిక ఉన్న ఫోటో బయటకు వచ్చింది. దీంతో విజయ్ ఫ్యామిలీ ట్రిప్ లో రష్మిక జాయిన్ అయ్యారన్న విషయం లీకైంది.

27
Vijay Devarakonda-Rashmika Mandanna

విజయ్ ఎక్కడికెళ్లినా రష్మిక పక్కనే ఉంటుంది. ఫ్యామిలీ ట్రిప్ లో కూడా ఆయన రష్మికను భాగం చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఎఫైర్ వార్తలు నిజమే కావచ్చని నెటిజన్స్ అంటున్నారు. నెలల వ్యవధిలో రెండు పర్యాయాలు రష్మిక-విజయ్ దేవరకొండ మాల్దీవ్స్ వెళ్లారు. ఈ విషయాన్ని రష్మిక ధృవీకరించారు. విజయ్ గుడ్ ఫ్రెండ్, అతనితో ట్రిప్ కి వెళితే తప్పేంటని ఆమె ఎదురు ప్రశ్నించారు. 
 

37
Vijay Devarakonda-Rashmika Mandanna

ఎప్పటి నుండో రష్మిక విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులకు దగ్గరయ్యారు. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే చిన్న చిన్న వేడుకలకు, బర్త్ డే ఫంక్షన్స్ కి రష్మిక హాజరవుతారు. తాజాగా దుబాయ్ లో మరోసారి విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు రష్మిక కనిపించారు. 
 

47
Vijay Devarakonda-Rashmika Mandanna


ఇదంతా స్నేహంలో భాగమే. మా మధ్య ఎఫైర్, లవ్ లేదని రష్మిక పలుమార్లు వెల్లడించారు. తమపై వచ్చే రూమర్స్ ని కూడా చదివి ఎంజాయ్ చేస్తానని రష్మిక ఓ సారి చెప్పారు. ఈ క్రమంలో కాలమే సమాధానం చెప్పాలి అంటున్నారు. కాగా గతంలో రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించారు. ఎంగేజ్మెంట్ కూడా జరిగాక పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. 
 

57


ప్రస్తుతం రష్మిక(Rashmika Mandanna) కెరీర్ పీక్స్ లో ఉంది. ఈ స్టార్ లేడీ బడా బడా స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు. పుష్ప మూవీతో ఫస్ట్ పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకున్న రష్మిక మందాన ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు. అనతి కాలంలో ఎదిగిన ఈ లక్కీ లేడీ సౌత్ టు నార్త్ దున్నేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాలకు ఈమె కేరాఫ్  అడ్రస్ అయ్యారు. 

67

పుష్ప 2, యానిమల్ చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. పుష్ప 2 రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో దర్శకుడు సుకుమార్ భారీగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. సీక్వెల్ లో అల్లు అర్జున్(Allu Arjun) తో రష్మిక కెమిస్ట్రీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరం.
 

77

పుష్ప 2, యానిమల్, మిషన్ మజ్ను చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. పుష్ప 2 రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో దర్శకుడు సుకుమార్ భారీగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. సీక్వెల్ లో అల్లు అర్జున్(Allu Arjun) తో రష్మిక కెమిస్ట్రీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరం.
 

click me!

Recommended Stories