కారులోపల కుమారి కవ్వింపు చర్యలు.. క్యూట్ సెల్ఫీలతో కట్టిపడేస్తున్న హేబా పటేల్

First Published | Feb 2, 2023, 11:26 AM IST

యంగ్ హీరోయిన్ హేబా పటేల్ (Hebah Patel) సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ అందాల విందుతో అదరగొడుతోంది. లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

గ్లామరస్ హీరోయిన్ హేబా పటేల్ ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులోనూ అవకాశాలను అందుకుంటోంది. సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన కుమారి వరుస సినిమాలతో సందడి చేస్తూనే ఉన్నారు. 
 

గతేడాది మొత్తం తెలుగులోనే ఎక్కువ చిత్రాల్లో నటించింది. లీడ్ యాక్ట్రెస్ గా ‘ఓదెల రైల్వే స్టేషన్’తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.  డీగ్లామరస్ రోల్ లో తనదైన పెర్ఫామెన్స్ ను చూపించింది. హేబా నటనకు మంచి మార్కులు పడ్డాయి.


మరోవైపు గ్లామర్ రోల్స్ లోనూ నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోందీ బ్యూటీ. రీసెంట్ గా ‘శాసనసభ’ చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకుంది. గ్లామర్ మెరుపులతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ఇక ఇటు సోషల్ మీడియాలోనూ హేబా పటేల్ సందడి చేస్తోంది.

ఈ  సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అలరిస్తూనే వస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో కనువిందు చేస్తుంటుంది. తాజాగా క్యూట్ పిక్స్ తో ఆకట్టుకుంటోంది. ఉదయమే సూర్యరష్మిని తీసుకుంటూ కారులో సెల్ఫీలకు ఫోజులిచ్చింది. 

బ్లాక్ చుడీదార్ లో మెరిసిన ఈ బ్యూటీ.. చున్నీ తీసేసి మరీ సెల్ఫీలకు పోజులిచ్చింది. క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లను మైమరిపించింది. నేచురల్ అందంతో ఆకట్టుకుంటోంది. హేబా సింపుల్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  ‘ఆద్య’, వల్లన్’ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చాయి. త్వరలో విడుదల కానున్నాయి. ఇక తెలుగులో నెక్ట్స్ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు.   

Latest Videos

click me!