సమంతను మించి సోషల్ మీడియాలో రష్మిక మందన్న క్రేజ్.. తొలి హీరోయిన్ గా రికార్డు చేసిన శ్రీవల్లి..

First Published | Apr 30, 2023, 3:02 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది.  ముఖ్యంగా సోషల్ మీడియాలో శ్రీవల్లి హవా మామూలుగా లేదు. తాజాగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. 
 

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.  ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగుతోంది. వరుస చిత్రాలతో అదరగొడుతోంది. కొత్త ప్రాజెక్ట్స్ ను కూడా వెంటవెంటనే అనౌన్స్ చేస్తూ సందడి చేస్తోంది. అంతకంతకూ క్రేజ్ పెంచుకుంటూ పోతోంది.
 

‘పుష్ప’ చిత్రంతో రష్మిక మందన్నకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. శ్రీవల్లి పాత్రలో అదరగొట్టి సౌత్, నార్త్ లో భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. దెబ్బకు నేషనల్ క్రష్ గా మారిపోయింది. రీసెంట్ గా IMDb పాపులర్ ఇండియన్ సెలబ్రెటీల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.
 


తాజాగా మరో రికార్డును క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న రష్మిక మందన్న భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. సౌత్ హీరోయిన్లలోనే అత్యధిక ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న నటిగా నేషనల్ క్రష్ రికార్డు క్రియేట్ చేసింది. సమంత, పూజా హెగ్దేల కంటే వెనకాలే వచ్చినా వారి దాటేసి మరీ ఫాలోయింగ్ ను సాధించింది. 
 

ఇన్స్టా గ్రామ్ లో 38 మిలియన్లు, ట్వీటర్ లో 4.5 ఫాలోవర్స్ మొత్తంగా 42.5 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. సౌత్ హీరోయిన్లలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తొలి హీరోయిన్ గా రికార్డు నమోదు చేసింది. సౌత్ తోపాటు నార్త్ ఆడియెన్స్ కు కూడా దగ్గరైన రష్మిక సోషల్ మీడియాలో తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటోంది. మున్ముందు వచ్చే ప్రాజెక్ట్స్ తో మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది.
 

రష్మిక తర్వాత స్టార్ హీరోయిన్ సమంతకు 26.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక కాజల్ కు 25.4 మిలియన్లు, పూజా హెగ్దేకు 23.5 మిలియన్లు, రకుల్ ప్రీత్ సింగ్ కు 23.1, తమన్నా భాటియాకు 20.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం నేషనల్ క్రష్ ‘పష్ప2 : ది రూల్’, ‘యానిమల్’ వంటి భారీ ప్రాజెక్ట్స్ లలో నటిస్తోంది. 
 

ఇక శ్రీవల్లి లైనప్ లో ‘రెయిన్ బో’, VNRTrio కూడా ఉన్నాయి. ప్రస్తుతం Rainbow చిత్ర షూటింగ్ లో ఉంది. నిన్నే ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు అప్డేట్ అందించింది. మరోవైపు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కోడలిగా నటించబోతున్నట్టు ప్రచారం. యంగ్ స్టార్  విక్కీ కౌషల్ సరసన మహారాణి పాత్రలో అలరించేందుకు సిద్దం అవుతోంది. మొత్తానికి రష్మిక మందన్న అన్నింటా దూసుకుపోతోంది.
 

Latest Videos

click me!