క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం కూడా దర్శకనిర్మాతలు తారక్ ని సంప్రదిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 ఖరారైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ముందు వరకు ఎన్టీఆర్ ఒక చిత్రానికి 12 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ పారితోషికం 60 నుంచి 80 కోట్లకు చేరింది. వార్ 2 కోసం తారక్ 80 కోట్లకి పైనే తీసుకుంటున్నట్లు టాక్.