ప్రెగ్నెంట్ గా ఉన్న ఉపాసన కోసం.. ఎన్టీఆర్ భార్య ప్రణిత సర్ ప్రైజ్.. ఏం చేసిందంటే..?

First Published | Apr 30, 2023, 2:14 PM IST

మోగా కోడలు ఉపాసన ప్రస్తుతం ప్రగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే.. చరణ్ షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చిమరీ ఆమెను దగ్గరుంచి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉపాసనకు సెలబ్రిటీల నుంచి కూడా మంచి మంచి గిఫ్ట్ అందుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి కూడా ఉపాసన కోసం సర్ ప్రైజ్ ఇచ్చారట. 

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ గా ఉన్నహీరోల ఎన్టీఆర్ రామ్ చరణ్ పేరు ముందుగా చెప్పుకోవాలి. వీరి భార్యలు కూడా మంచి స్నేహితులే. వీరితో పాటు బన్నీవైఫ్ స్నేహారెడ్డి కూడా వీరితో మంచి ఫ్రెండ్షిప్ మెయింటేన్ చేస్తుంటుంది.ఇక వీరు అప్పుడప్పుడు కలుసుకోవడం. పార్టీలు చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. 


తరచూ ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి కనిపించకపోయిన వ్యక్తిగతంగా తరచు కలుస్తూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఇలా లక్ష్మీ ప్రణతి ఉపాసన మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉందని చెప్పాలి. ఈ బాండింగ్ తోనే తల్లి కాబోతున్న ఉపాసనకోసం లక్ష్మీ ప్రణతి ఎంతో కష్టపడి కొన్ని పంపించిందట. 
 


ప్రస్తుతం ప్రగ్నెంట్ తో ఉన్న  ఉపాసన కోసం ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి రకరకాల పిండి వంటలను తయారు చేసి పంపించారట. డ్రై ఫ్రూట్స్ లడ్డులు, సున్నుండలు వంటి పిండివంటలను తానే  స్వయంగా తయారు చేసి ఉపాసన కోసం పంపించారని సమాచారం.  తల్లికాబోతున్నవారికి.. రకరకాల రుచులు తినాలి అనిపిస్తుంది. ఆ విషయం తెలుసు కాబట్టి.. ప్రణీత ఇలా సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందంట. 
 

కడుపులో ఉన్న బిడ్డకు మంచి పోషలకాలు అందేలా.. డ్రైఫూట్స్ తో పాటు.. రకరకాలు పప్పుల కలయికతో.. ఇవి తయారు చేసిందట. చిత్రం ఏంటంటే.. ఇలా ప్రణతికి ప్రేమగా ఉపాసనకు స్వీట్స్ పంపించారని  ఎన్టీఆర్. రామ్ చరణ్ కు కూడా తరువాత తెలిసిందట. ఈ విషయం తెలిసి వారు షాక్ అయినట్టు సమాచారం. 
 

ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. అటు మెగా ఫ్యాన్స్.. ఇటు నందమూరి ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి దిల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కొరటాలతో తన 30వ సినిమా సెట్స్ ఎక్కించారు. చరణ్ మాత్రం ఉపాసన డెలివరీ వరకూ షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!