హార్ట్ సింబల్ తో రష్మిక మందన్న.. మళ్లీ గుర్తుచేసిందా? నేరు గా అడుగుతున్న ఫ్యాన్స్!

Published : Jan 29, 2024, 07:00 PM ISTUpdated : Jan 29, 2024, 07:01 PM IST

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న Rashmika Madanna ఇంట్రెస్టింగ్ గా పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ పోస్ట్ పై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.   

PREV
16
హార్ట్ సింబల్ తో రష్మిక మందన్న.. మళ్లీ గుర్తుచేసిందా? నేరు గా అడుగుతున్న ఫ్యాన్స్!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ‘పుష్ప’ చిత్రం తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. తన అందం, అభినయంతో నేషనల్ క్రష్ గానూ మారిపోయింది. దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఈ క్రేజ్ తో బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. 

26

కొన్నాళ్లుగా రష్మిక మందన్న హిందీ చిత్రాల్లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక గతేడాది డిసెంబర్ 1 బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ Ranbir Kapoor సరసన ‘గీతాంజలి’ పాత్రలో నటించి మెప్పించింది. తన నటనతో ఫిదా చేసింది. ఇందుకు ఆడియెన్స్ నుంచి మంచి ప్రశంసలు అందాయి. 
 

36

ఇక ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆవిషయం చెబుదామనే నేషనల్ క్రష్ స్టైలిష్ లుక్ లో ఫొటోషూట్ చేసింది. స్టన్నింగ్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ.. ఓటీటీ Animal మూవీ చూడండి అంటూ పోస్ట్ పెట్టింది. 
 

46

ఇదిలా ఉంటే.. తన హార్ట్ సింబల్ చూపిస్తూ అభిమానుల ప్రేమను పొందినందుకు సంతోషిస్తున్నట్టు తెలిపింది. ఫ్యాన్స్ కూడా రష్మికను ‘గీతాంజలి’గానే గుర్తుపెట్టుకున్నారు. నెట్టింట అలాగే పిలుస్తున్నారు కూడానూ.. 
 

56

ఇక మరికొందరు నెటిజన్లు మాత్రం రష్మిక ఫొటోలపై ఇంట్రెస్టింగ్ గాస్పందిస్తున్నారు. హార్ట్ సింబల్ చూపించడంతో... తన మనస్సులో ఉన్నది విజయ్ దేవరకొండనే కదా అంటూ... విజయ్ తో  నిశ్చితార్థం ఎప్పుడంటూ నేరుగా అడిగేస్తున్నారు. 
 

66

ఇక దీనిపై ఇప్పటికే వచ్చిన రూమర్లను విజయ్ టీమ్ ఖండించింది. రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలంటున్నారు. ఏదేమైనా రష్మిక మందన్న మాత్రం క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప2’, ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘చావా’ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories