దుబాయ్‌లో గురిచూసి బాణం వేసిన రష్మిక మందన్నా.. వెనకాల నుంచి వేయిస్తున్నది ఆ స్టార్‌ హీరోనేనా?

Published : Apr 07, 2024, 06:34 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఇటీవల తన పుట్టిన రోజుని జరుపుకుంది. అయితే ఆమె దుబాయ్‌లో ప్రైవేట్‌గా ఈ సెలబ్రేషన్‌ చేసుకోవడం విశేషం.   

PREV
17
దుబాయ్‌లో గురిచూసి బాణం వేసిన రష్మిక మందన్నా.. వెనకాల నుంచి వేయిస్తున్నది ఆ స్టార్‌ హీరోనేనా?

రష్మిక మందన్నా.. ఏప్రిల్‌ 5న బర్త్ డే జరుపుకుంది. అందుకోసం ఆమె దుబాయ్‌ వెకేషన్‌ వెళ్లింది. ఫ్యామిలీతో కాకుండా ఆమె ఒంటరిగానే వెకేషన్‌లో తన బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. ఈ వెకేషన్‌ పిక్స్ ని, వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది రష్మిక మందన్నా. ఆయా ఫోటోలు, క్లిప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

27

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక.. ఓ చిన్న వీడియో క్లిప్‌ని షేర్‌ చేసుకుంది. ఇందులో ఆమె బీచ్‌ సమీపంలో విల్లు ప్రాక్టీస్‌ చేసింది. గురి చూసి కరెక్ట్ గా కొట్టింది రష్మిక మందన్నా. కరెక్ట్ గా పాయింట్‌ మీద తగిలింది. ఈ వీడియో క్లిప్‌ యమ వైరల్‌ అవుతుంది. 
 

37

ఈ సందర్భంగా వాట్‌ ఏ ఫన్‌ డే అంటూ ఈ పోస్ట్ పెట్టింది రష్మిక. అయితే ఇందులోనే ఓ పెద్ద తిరకాసు ఉంది. ఈ వీడియోలో రష్మిక ఒక్కరు మాత్రమే కాదు, మరో వ్యక్తి కూడా ఉన్నారు. అదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. రష్మిక బాణం వేసిన అనంతరం ఇలా ఇవ్వు అనేలా ఓ చెయి ఆమె వద్దకు వచ్చింది. ఆ చేయి ఎవరిది అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అది ఆ స్టార్‌ హీరోదే అని తేల్చేస్తున్నారు నెటిజన్లు. 
 

47

రష్మిక మందన్నా.. ప్రస్తుతం రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండతో లవ్‌ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో ఈ ఇద్దరు దొరికిపోయారు. రష్మిక మందన్నే చాలా సార్లు లీకులు ఇస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా ఆమె మరోసారి లీక్‌ ఇచ్చింది. ఈ వీడియోలో ఉన్నది విజయ్‌ దేవరకొండనే అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. 

57

ఆమె వైపు వెనకాల వచ్చిన ఆ చేయి విజయ్‌ దేవరకొండనే అని అభిమానులు, నెటిజన్లు తేల్చేస్తున్నారు. అయితే విజయ్‌ కూడా ఈ నెల 4న దుబాయ్‌కి వెళ్లిపోయాడు. ఆయన `ఫ్యామిలీ స్టార్‌` ప్రమోషన్స్ పూర్తి చేసుకునే రిలీజ్‌కి ముందురోజే వెళ్లిపోయాడు. దీంతో రష్మిక బర్త్ డే కోసమే ఆయన వెళ్లినట్టు ఫిల్మ్ నగర్‌ టాక్‌. ఈ రకంగానూ ఆ వీడియోలో ఉన్నది విజయ్‌ అని కన్ఫమ్‌ చేస్తున్నారు ఇంటర్నెట్‌ జనాలు. 
 

67

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా `గీతగోవిందం`లో కలిసి నటించారు. ఆ సమయం నుంచి ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ తర్వాత `డియర్‌ కామ్రేడ్‌`లో మెరిశారు. దీంతో ఆ స్నేహం ప్రేమగా మారింది. అప్పట్నుంచి ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారు. అయితే వీరి ప్రేమ సీరియస్‌గానే అని తెలుస్తుంది. చాలా సందర్భాల్లో రష్మిక.. విజయ్‌ ఇంటికి వస్తుంది. పండగలు కూడా వాళ్లింట్లోనే సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ఇలా తమ ప్రేమని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 
 

77

 విజయ్‌ దేవరకొండ నటించిన `ఫ్యామిలీ స్టార్‌` ఈ శుక్రవారం విడుదలైంది. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్‌తో రన్‌ అవుతుంది. కలెక్షన్లు డల్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు రష్మిక మందన్నా `పుష్ప 2`లో నటిస్తుంది. అల్లు అర్జున్‌ బర్త్ డే సందర్భంగా రేపు ఈ మూవీ టీజర్‌ రాబోతుంది. దీంతోపాటు `రెయిన్‌బో`, `ది గర్ల్ ఫ్రెండ్`, `కుబేర` చిత్రాల్లో నటిస్తుంది రష్మిక. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories