Rashmika Mandanna : రష్మిక మందన్న తెలియకుండా భలే మేనేజ్ చేసింది... ‘యానిమల్’తో మళ్లీ మొదలు.!

First Published Dec 1, 2023, 3:26 PM IST

నేషనల్ క్రష్ చాలా రోజుల తర్వాత హిట్ అందుకుంది. బాలీవుడ్ నుంచి వచ్చిన ‘యానిమల్’తో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తన పెర్ఫామెన్స్ కూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కానీ కొన్ని విషయాల్లో తనకున్నక్రేజ్ తో రష్మిక భలే మేనేజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)  క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ మోస్ట్ వాటెంటెడ్ గా కెరీర్ ను సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే రష్మిక కూడా కొన్నివిషయాలను తనకున్న క్రేజ్ తో పెద్దగా హైలెట్ కాకుండా చేసింది.
 

మొదట రష్మిక మందన్న ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప : ది రైజ్’ చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ ను దక్కించుకుంది. శ్రీవల్లిగా ఇండియా మొత్తంగా పరిచయం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ముద్దుగుమ్మ కాస్తా గుర్తింపు సొంతం చేసుకుంది. 
 

‘పుష్ప’లో తను డీగ్లామర్ రోల్ లో ఇచ్చిన పెర్ఫామెన్స్ కు విశేష ఆదరణ లభించింది. అటు అల్లు అర్జున్ కు కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కింది. అయితే, ‘పుష్ప’ తర్వాత రష్మికకు పెద్దగా హిట్లు కనిపించకపోవడం విశేషం. తను నటించిన సినిమాలు ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. 
 

ప్రస్తుతం రన్బీర్ కపూర్ ‘యానిమల్’తో మంచి హిట్ ను సొంతం చేసుకుంది. అంతకు ముందు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, ‘సీతారామం’, ‘వరిసు’, ‘మిషన్ మజ్ను’, అంతకు ముందు ‘గుడ్ బై’ వంటి సినిమాల్లో నటించింది. అందులోని సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ‘సీతారామం’ సినిమా బ్లాక్ బాస్టర్ అయినా.. రష్మిక గెస్ట్ రోల్ కే పరిమితమైంది. 
 

డైరెక్ట్ హిట్ ను మాత్రం ‘పుష్ప’ తర్వాత ‘యానిమల్’తోనే దక్కించుకుంది. ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన Animal The Film లో రష్మిక పెర్ఫామెన్స్ కూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఐదు సినిమాల తర్వాత రష్మిక మాసీవ్ సక్సెస్ ను చూసింది. ‘పుష్ప’ తర్వాత ఆ స్థాయి పెర్ఫామెన్స్ ఇచ్చింది.  పాత్ర తాలుకూ డిమాండ్ ఎలా ఉన్నా.. రష్మిక మాత్రం తన బెస్ట్ ఇచ్చి ఆకట్టుకుంది. 

అయితే రష్మికకు ‘పుష్ప’తో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో అవకాశాలు దక్కాయి. ఈ క్రమంలోనే తను నటించిన నాలుగు సినిమాలు పెద్దగా సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. కానీ ‘శ్రీవల్లి’ పాత్రలో తన పెర్ఫామెన్స్ తో దక్కించుకున్న క్రేజ్ తో ఇన్నాళ్లు తన ఖాతాలో చేరిన ఫ్లాప్స్ ను ఏమాత్రం బయటికి కనపడకుండా మేనేజ్ చేసింది. మొత్తానికి మళ్లీ ‘యానిమల్’ తో హిట్ అందుకొని సక్సెస్ బాట పట్టింది. తర్వాత మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప2’, ‘రెయిన్ బో’తోనూ హిట్ అందుకోబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.  

click me!