విజయ్ దేవరకొండ, రష్మిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఎట్టకేలకు వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికి పరిచయం ఏర్పడ్డ కొత్తల్లో రష్మిక.. విజయ్ కి వార్నింగ్ ఇచ్చింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో విజయ్, రష్మిక పెళ్లి గ్రాండ్ గా జరిగింది. గత కొన్నేళ్లుగా విజయ్, రష్మిక ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గీత గోవిందం చిత్రంతో తొలిసారి విజయ్, రష్మిక మధ్య పరిచయం ఏర్పడింది.
25
గీత గోవిందం సినిమాతో పరిచయం
పరుశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ప్రెజెంట్ చేసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో రష్మిక, విజయ్ మధ్య కెమిస్ట్రీకి యువత ఫిదా అయ్యారు. ఈ మూవీతో వీరి మధ్య స్నేహం మొదలై ఆ తర్వాత ప్రేమగా మారింది. కానీ తాము ప్రేమలో ఉన్నట్లు ఎప్పుడూ డైరెక్ట్ గా విజయ్, రష్మిక చెప్పుకోలేదు. మొత్తానికి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
35
రష్మిక ఇచ్చిన ఫస్ట్ వార్నింగ్
దీనితో విజయ్, రష్మికకి సంబంధించిన విశేషాలని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండకి రష్మిక ఇచ్చిన ఫస్ట్ వార్నింగ్ గురించి అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అర్జున్ రెడ్డి మూవీ సమయంలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణం అయ్యాయి. అది బోల్డ్ గా తెరకెక్కించిన చిత్రం. దీనితో విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ లో కూడా బోల్డ్ యాటిట్యూడ్ తో వార్తల్లో నిలిచాడు.
కానీ గీత గోవిందం యువత ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా రూపొందించిన మూవీ. దీనితో ఈ మూవీ విషయంలో విజయ్ దేవరకొండ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తాను ఈ రోజు ఎలాంటి రచ్చ చేయకుండా తనకు చాలా మంది వార్నింగ్ ఇచ్చారు అని విజయ్ దేవరకొండ తెలిపాడు.
55
విజయ్ దేవరకొండ కామెంట్స్
తనకి వార్నింగ్ ఇచ్చిన వారిలో రష్మిక మేడం కూడా ఉన్నారు అంటూ సరదాగా తెలిపాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లుంగీ కట్టుకుని హంగామా చేసిన విజయ్.. తన కామెంట్స్ లో ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకున్నాడు. తనకు ఉదయం నుంచే బన్నీ వాసు, దర్శకుడు పరుశురాం వార్నింగ్ ఇస్తూ వచ్చారు అని తెలిపాడు. అల్లు అరవింద్ గారు అయితే ఫోన్ చేసి మరీ జాగ్రత్తాగా మాట్లాడమని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. రష్మిక స్టేజీపై మాట్లాడుతూ.. గోవింద్(విజయ్ దేవరకొండ) చాలా మారాలి అంటూ ఫన్నీగా వార్నింగ్ ఇచ్చింది.