రష్మిక మందన్నా మొదటిసారి ఐటెమ్‌ సాంగ్‌.. త్రివిక్రమ్‌ నెక్ట్స్ లెవల్ ప్లాన్‌.. థియేటర్లలో పూనకాలే ?

First Published | Nov 29, 2022, 10:06 AM IST

రష్మిక మందన్నా పాన్‌ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతుంది. అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తుంది. ఇప్పుడు మరో డేరింగ్‌ స్టెప్‌ తీసుకుంటుంది. ఐటెమ్‌ భామలా మారబోతుంది. 
 

నేషనల్‌ క్రష్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాలతో దూసుకుపోతుంది. ఆమె క్రేజ్‌, ఇమేజ్‌ సైతం ఇండియా వైడ్‌గా వ్యాపించాయి. సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. చేతిలో అరడజను సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో రష్మిక ఓ డేర్ స్టెప్‌కి రెడీ అవుతుందట. 
 

ఫస్ట్ టైమ్‌ రష్మిక మందన్నా ఐటెమ్‌ సాంగ్‌(Rashmika Item Song) చేయబోతుందని సమాచారం. సూపర్‌ స్టార్‌ మహేష్‌తో ఆమె స్పెషల్‌ సాంగ్కి స్టెప్పులేయబోతుందట. దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందే మహేష్‌ సినిమాలో రష్మిక మందన్నా స్పెషల్‌ సాంగ్‌ చేయబోతుందని లేటెస్ట్ టాక్‌. 


ఆ మధ్య నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ మహేష్‌ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ ప్లాన్‌ చేస్తున్నామని, అది గుర్తిండిపోయేలా చేయాలనుకుంటున్నామని, అయితే త్రివిక్రమ్‌ని ఒప్పించే పనిలో ఉన్నామన్నారు. జనరల్‌గా త్రివిక్రమ్‌ సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్‌లు ఉండవు. మొదటిసారి ఆయన నిర్మాతల ఒత్తిడి మేరకు స్పెషల్‌ సాంగ్‌ పెట్టబోతున్నారట. 

అందులో భాగంగా రష్మిక మందన్నాతో ఈ ఐటెమ్‌ సాంగ్‌ చేయించాలని భావిస్తున్నారట. అందుకే ఇప్పటి వరకు స్పెషల్‌ సాంగ్‌లు చేయని రష్మికతో చేయిస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని టీమ్‌ భావిస్తుందట. ప్రస్తుతం రష్మికతో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. మరి రష్మిక ఒప్పుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మహేష్‌, రష్మిక కలిసి `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. 
 

Rashmika Mandanna

ఇక రష్మిక మందన్నా మాస్‌ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె గ్లామర్‌ షో లోనూ హద్దులు చెరిపేస్తుంది. ఇటీవల ఆమె హాట్‌ షో బౌండరీలు బ్రేక్‌ అయ్యేలా ఉన్నాయి. తను అందాలు ఆరబోస్తే ఎవ్వరైనాపడి ఉండాల్సిందే అనేట్టుగా గ్లామర్‌ షోతో బ్లాస్ట్ అవుతుంది రష్మిక. తరచూ నెట్టింట హాట్‌ టాపిక్ అవుతుంది. ఇలాంటి టైమ్‌లో ఆమె ఈ స్పెషల్‌ సాంగ్‌ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు నెటిజన్లు. ఇదే ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. 

ప్రస్తుతం రష్మిక హీరోయిన్‌గా బిజీగా ఉంది. తెలుగులో `పుష్ప2`తోపాటు హిందీలో `యానిమల్‌`, `మిషన్‌ మజ్ను` చిత్రాలు చేస్తుంది. అలాగే మరో సినిమాకి టాక్స్ జరుగుతున్నాయట. తమిళంలో విజయ్ తో `వారసుడు` చేసింది. దీంతోపాటు మరో సినిమా చేస్తుంది. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. 
 

ఇదిలా ఉంటే మహేష్‌-త్రివిక్రమ్‌ (Mahesh-Trivikram) సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుంది. సెకండ్‌ హీరోయిన్‌గా శ్రీలీలాని ఫైనల్‌ చేశారని టాక్‌. అలాగే థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో రష్మిక ఐటెమ్‌ సాంగ్‌ అనే వార్త ఈ చిత్రంపై అంచనాలను పెంచుతుంది.

అయితే తండ్రి కృష్ణ మరణం కారంగా SSMB28 షూటింగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ మొదటి వారంలో షూటింగ్‌ని తిరిగి ప్రారంభించబోతున్నారు. అదే సమయంలో రిలీజ్‌ డేట్‌ని మార్చబోతున్నారట. మొదట ఏప్రిల్‌లో రిలీజ్‌ అనుకున్నారు. ఇప్పుడు ఆగస్ట్ 11 2023లో విడుదల చేయాలని భావిస్తున్నారట. 

Latest Videos

click me!