అంతర్జాతీయ సినిమా వేదికపై 'ది కాశ్మీర్ ఫైల్స్'  దుమారం...రాజకీయ హైడ్రామాకు తెరలేపిన వివాదాస్పద చిత్రం!

First Published Nov 29, 2022, 9:44 AM IST

అంతర్జాతీయ వేదిక సాక్షిగా కాశ్మీర్ ఫైల్స్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ హెడ్ నడవ్ లాపిడ్ కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఉద్దేశించి చేసిన నెగిటివ్ కామెంట్స్ వివాదం రాజేశాయి.

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో రూపొందిన 'ది కాశ్మీర్ ఫైల్స్' భారీ ఆదరణ దక్కించుకుంది. చిన్న సినిమాగా విడుదలై రికార్డు వసూళ్లు రాబట్టింది. అయితే అదే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించిన కంటెంట్ పై కొందరు అభ్యంతరం తెలిపారు. ఇది రాజకీయ అజెండాలో భాగంగా తెరకెక్కిన చిత్రంగా అభివర్ణించారు.

తాజాగా 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికగా మరోసారి వివాదం రాజుకుంది. ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరి హెడ్ నడవ్ లాపిడ్ మూవీ మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం చూసి మేము ఖంగుతిన్నాము. ఇది ఒక వల్గర్ కంటెంట్ తో రాజకీయ ఉద్దేశ్యంలో భాగంగా తెరకెక్కిన చిత్రంలా ఉంది. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీలో చూపించిన వన్నీ అవాస్తవం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక అంతర్జాతీయ వేదికపై ఇలాంటి చిత్రాల గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. 


నవాద్ వ్యాఖ్యలపై ది కాశ్మీర్ మూవీ టీం అభ్యంతరం తెలిపారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర చేసిన అనుపమ్ ఖేర్ స్పందించారు. 1990 లో కాశ్మీర్ పండిట్స్ పై జరిగిన దురాగతాలను ఈ మూవీ ప్రపంచానికి తెలియజేసింది. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధితులైన 500 మంది కాశ్మీర్ పండిట్స్ ని కలిసి, ఇంటర్వ్యూ చేశారు. వారి అనుభవాలు అడిగి తెలుసుకున్నారు. 
 


1990 జనవరి 19న ఏకంగా 5 లక్షల మంది కాశ్మీర్ పండిట్స్ తమ ఇళ్ళు వదిలి పారిపోయారు. వారిలో నేను కూడా ఉన్నాను. ఈ దుర్ఘటనను ఎవరూ గుర్తించలేదు. దాని గురించి మాట్లాడలేదు. ప్రపంచం ఈ విషాదాన్ని దాచేందుకు ప్రయత్నం చేస్తుంది. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీతో మేము వాస్తవంగా జరిగిన దారుణాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, అని అన్నారు. 


అనుపమ్ ఖేర్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖుల ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఉద్దేశించి ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ హెడ్  చేసిన కామెంట్స్ ని ఖండిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా, ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆ చిత్రంలో కీలక రోల్ చేసిన దర్శన్ కుమార్ సైతం లాపిడ్ పై ఫైర్ అయ్యారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయం చెప్పే అధికారం కలిగి ఉన్నారు. అయితే కాశ్మీర్ పండిట్స్ హింసకు గురయ్యారనేది కాదనలేని నిజం. ఇప్పటికీ కొందరు ఆ సమస్యను ఎదుర్కొంటున్నారని, చెప్పుకొచ్చారు. 


అదే సమయంలో లాపిడ్ కామెంట్స్... బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య వాదనలకు తెరలేపాయి. బీజేపీ నేతలు ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ హెడ్  కామెంట్స్ ని ఖండిస్తుండగా, కాంగ్రెస్ నేతలు మద్దతు తెలుపుతున్నారు. బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ది కాశ్మీర్ ఫైల్స్ మూవీని వెనకుండి తెరపైకి తెచ్చారు అంటున్నారు. మొత్తంగా ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది. 
 

click me!