Guppedantha Manasu: ధరణి మాటలకు షాకైన దేవయాని.. రిషి చేసిన పనికి సంతోషపడుతున్న జగతి?

First Published Nov 29, 2022, 9:32 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 29 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో ఫణీంద్ర మొబైల్ చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ధరణి వస్తుంది. అప్పుడు ఏంటి ధరణి అని అనగా జగతి అత్తయ్య వాళ్ళు ఎప్పుడొస్తారంట మావయ్య అనడంతో ఇందాక మహేంద్ర ఫోన్ చేశారు డిశ్చార్జ్ చేస్తారంట అనగా ధరణి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నాను మామయ్య అని అనడంతో నేను కూడా ఎదురు చూస్తున్నాను అమ్మ అని అంటాడు. ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి అందరికంటే నేనే ఎక్కువగా ఎదురుచూస్తున్నాను అని అంటుంది. అప్పుడు దేవయాని ధరణిని వెటకారంగా మాట్లాడిస్తూ వాళ్ళు వస్తున్నారని సంబరాలు చేస్తావా అని అంటుంది.

అప్పుడు ఫణీంద్ర అలా మాట్లాడకు దేవయాని వాళ్ళు రాగానే వాళ్ళు ఎందుకు వెళ్లారు అడిగి నేను తెలుసుకుంటాను అని అనగా దేవయాని ఆశ్చర్య పోతుంది. ఇప్పుడు దేవయానికి టెన్షన్ పడుతూ మీరు అడిగిన చెప్తారా ఏంటి అయినా వెళ్లిపోయిన వారిని ఎందుకు వెళ్లారు అని అడగడం ఎందుకు అని అనగా వెంటనే ఫణీంద్ర కాలేజీలోనే అడగాలనుకున్నాను. హాస్పిటల్ లో కూడా అడగలేము అందుకే ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. అప్పుడు దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది.
 

అప్పుడు ధరణి నాకు కొంచెం భయంగా ఉంది అత్తయ్య గారు చిన్న అత్తయ్య చిన్న మామయ్య వెళ్లిపోవడానికి అసలు కారణం మీరే అని తెలిస్తే అనగా దేవయాని షాక్ అవుతుంది. ఒక్కసారిగా ధరణి పై దేవయాని కోపంతో ఊగిపోతుంది దేవయాని. అప్పుడు ఏంటి ధరణి ఎలా మాట్లాడుతున్నావు అత్త కోడలు ఎలా ఉండాలి ఫ్రెండ్స్ లా కలిసిపోయి ఉండాలి అంటూ తన తప్పుని కప్పి పుచ్చుకోవడానికి దేవయాని నాటకాలు ఆడుతుంది. ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ గా ఉంటూ నా తప్పు లేదని చెప్పాలి కానీ ఇలా మాట్లాడకూడదు అని చెప్పి అక్కడ నుంచి పంపిస్తుంది. మరొకవైపు జగతికి వసుధార సేవలు చేస్తూ ఉంటుంది.
 

 అప్పుడు ఎందుకు వసు ఇవన్నీ అనడంతో మీకు సేవ చేసుకోనివ్వండి మేడం అని అంటుంది. అప్పుడు జగతి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార మేడం ఈమధ్య మీ మాటలు మీ ప్రవర్తన అస్సలు అర్థం కావడం లేదు. అసలు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమీ అర్థం కావడం లేదు మేడం అని అంటుంది వసుధార. అప్పుడు జగతి కొన్ని ప్రశ్నలకు మనం సరిగ్గా సమాధానం చెప్పలేము వసు అని అంటుంది. కొన్ని కొన్ని సార్లు కొన్ని బాధలకు ఇంకొందరిని బాధ్యుల్ని చేయాల్సి వస్తుంది అని అంటుంది జగతి.
 

మీరు ఇంట్లోంచి వెళ్లినప్పటి నుంచి ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ఎలా ఉంటున్నారో అని చాలా టెన్షన్ పడ్డాము బాధ పడ్డాము మేడం అని అంటుంది. అప్పుడు జగతి మేము వెళ్లామని మీరు బాధపడుతున్నారు కదా మేము అక్కడ ఎంత బాధపడి ఉంటామో మీకేం తెలుసు వసు అని అంటుంది. అప్పుడు వసుధర మీరు వెళ్లడానికి నేనేమైనా కారణమా అని అనగా చెప్పాను కదా వసు కారణాలు అడగొద్దు అని అంటుంది జగతి. ఇప్పుడు అన్ని సర్దుకున్నాయి కదా అని జగతి అనగా ఏం సర్దుకున్నాయి మేడం రిషి సార్ మహేంద్ర సార్ ను వదిలి హాస్పిటల్ నుంచి వెళ్ళాలి అంటేనే భయపడుతున్నారు.
 

మీరు ఎక్కడ మళ్ళీ సార్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో అని సార్ భయం భయంగా బాధపడుతున్నారు అని అంటుంది వసు. ఆ తర్వాత జగతి, రిషి నన్ను రమ్మని చెప్పి మెయిల్ చేశాడు వసుధార అని చెప్పడంతో వసుధార చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార ఇంత మంచి గుడ్ న్యూస్ నాకు సారి చెప్పలేదు మేడం అంటూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు వారిద్దరూ రిషిని పొగుడుతూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి మహేంద్ర, రిషి వస్తారు. ఇప్పుడు అక్కడికి వచ్చి వసుధారకు కనులతో సైగలు చేస్తాడు రిషి. అప్పుడు మహేంద్ర జగతి డాక్టర్ తో మాట్లాడాను డిశ్చార్జ్ చేస్తానన్నారు అనడంతో జగతి సంతోషపడుతూ ఉంటుంది.

అప్పుడు గౌతమ్ అక్కడికి వచ్చి ఈ ఫార్మాలిటీస్ అని పూర్తయ్యాయి రా అని అనగా బిల్ కట్టావా అని అనడంతో లేదు ఇంకా బిల్ తయారు చేస్తున్నారు అనడంతో అప్పుడు మహేంద్ర ఇదిగో నా కార్డుతో కట్టు అనగా వెంటనే రిషి మహేంద్రను ఆపి ఇదిగో నా కార్డుతో బిల్ కట్టేసేయ్ అని గౌతమ్ కి కార్డు ఇస్తాడు. అది చూసి జగతి సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు మేడం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకోసం ఒక స్పెషల్ గా నర్సుని పెడదామనడంతో సరే రిషి అని రిషివైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది జగతి. అప్పుడు వసుధార రిషి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి ఇంటికి కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు జగతి వసుధార రిషి ఇద్దరు కలిసిపోయారు అని ముచ్చట పడుతూ ఉంటుంది.

click me!