Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది

Published : May 18, 2026, 06:16 PM IST

ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే రష్మిక మందన్న, ఇటీవల నటుడు విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమె వివాదానికి కేరాఫ్‌ గా నిలిచింది.   

PREV
13
వివాదంలో రష్మిక మందన్నా

గతంలో పలు వివాదాల్లో నిలిచిన రష్మిక మందన్నా మరోసారి ఆమె కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం హిందీలో ఆమె `కాక్‌ టెయిల్‌ 2` చిత్రంలో నటిస్తోంది. ఈ  సినిమా పాటల విడుదల కార్యక్రమంలో F పదం వాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

23
కృతి సనన్‌పై రష్మిక కామెంట్‌
బాలీవుడ్ నటి కృతి సనన్‌ను పొగిడే క్రమంలో రష్మిక ఈ పదం వాడారు. తర్వాత వెంటనే క్షమాపణ చెప్పారు. రష్మిక మాటలు విని షాహిద్ కపూర్, కృతి సనన్ షాక్ అయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దినేష్ విజన్, దర్శకుడు హోమీ అదజానియా పాల్గొన్నారు.
33
షాహిద్‌ కపూర్‌ పట్టుకుంటే అసౌఖర్యానికి ఫీలైన రష్మిక

ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నా మాట్లాడుతున్న సమయంలో షాహిద్‌ కపూర్‌ ఆమెని వెనకాల నుంచి పట్టుకున్నాడు. దీంతో వెంటనే అసౌకర్యానికి గురయ్యింది రష్మిక. ఆయన చేతిని వదిలించుకునే ప్రయత్నం చేసింది. చాలా ఇబ్బంది పడుతూ రియాక్ట్ అయ్యింది. అయితే వెంటనే దాన్ని నవ్వుతో కవర్‌ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories