రామ్ చరణ్ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ `పెద్ది`. బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, ఎమోషన్స్ బాగున్నాయి. కానీ అసలు మైనస్ ఏంటంటే?
రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం `పెద్ది` సినిమా రూపొందుతుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పాటలు ఆకట్టుకున్నాయి. గ్లింప్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ లుక్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. సినిమా కోసం ఆయన మేకోవర్ వాహ్ అనిపించేలా ఉంది.
25
అదరగొడుతున్న రామ్ చరణ్ పెద్ది ట్రైలర్
తాజాగా `పెద్ది` సినిమా ట్రైలర్ వచ్చింది. ఇందులో విభిన్నమైన అంశాలను చూపించారు. ట్రైలర్‌లో హీరో క్రికెట్, కుస్తీ, ఇంకా ఆట ఏదైనా అందులో పెద్దినే ముందుంటాడు, ఆయనే ఆల్‌రౌండర్ అనేలా చూపించారు. ఎవరిని అడిగినా నచ్చిన గేమ్ చెబుతున్నారు, అందులో నెంబర్ వన్ ఎవరంటే పెద్ది పేరు చెబుతున్నారు. ఇది అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తన ప్రాంతం కోసం, తన మట్టి కోసం పెద్ది పోరాడుతాడనేది అంశాలను ఇందులో చూపించారు. అదే సమయంలో అథ్లెట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే, సినిమాలో ఆట, యాక్షన్ మాత్రమే కాదు, అంతకు మించిన ఎమోషన్స్ ఉన్నాయి. పాత్రల సంఘర్షణ ఉంది. భావోద్వేగాలున్నాయి. ప్రతి పాత్రని ఇందులో చూపించారు. వాటి స్వరూపాలను పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
35
రౌడీ బేబీలా జాన్వీ కపూర్
అటవి ప్రాంతంలో మనుగడం కోసం పోరాటం అనేలా ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఆటే నా పొగరు అని రామ్ చరణ్ చెప్పడం ఆయన పాత్రలోని యాటిట్యూడ్‌ని తెలియజేస్తుంది. అలాగే హీరోయిన్‌ని చూడగానే ఆయన ఫిదా అయిపోవడం, ఆమెతో రొమాన్స్ ఆకట్టుకుంది. ఇక జాన్వీ కపూర్ అందంగా ఉందేమోగానీ, పొగరు గట్టిగానే ఉందని, రౌడీ బేబీ తరహా పాత్రలో ఆమె కనిపించబోతుందని తెలుస్తోంది.
ఇక ఊరి పెద్ద తరహా పాత్రలో శివరాజ్ కుమార్ కనిపించారు. ఆట గెలవడం ముఖ్యం కాదు, బతకడం కావాలి అని ఆయన చెప్పడం ప్రాంతం కోసం పోరాటమనే విషయాన్ని తెలియజేస్తుంది. రామ్ చరణ్ అటు క్రికెట్‌లో, ఇటు కుస్తీలో, మరోవైపు రన్నింగ్ ఇలా అనేక ఆటల్లో నైపుణ్యం ఉందని, ఆయన తమ వారి కోసం ఆట ఆడుతున్నాడని తెలుస్తోంది. చివరగా నేను ఆడానని అనుకుంటున్నారు, కానీ నేను పోరాడాను సార్ అని రామ్ చరణ్ చెప్పే డైలాగ్‌లు ఆసక్తికరంగా ఉన్నాయి. ట్రైలర్‌లో చూపించనిది ఏదో ఉందని తెలుస్తోంది. చరణ్ ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడం, వీరి ఊర్లోకి రాజకీయ నాయకులు అడుగుపెట్టడం వంటి అంశాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
55
జూన్ 4న పెద్ది రిలీజ్
ట్రైలర్ మాత్రం ఫర్వాలేదు. అయితే ఇందులో ఏం చూపించాలనుకున్నారనేది క్లారిటీ లేదు. చాలా విషయాలు చూపించడంతో సినిమా మెయిన్‌గా దేని చుట్టూ తిరుగుతుంది, దేని కోసం చరణ్ పోరాటమనేది క్లారిటీ మిస్ అయ్యింది. ట్రైలర్ లెన్తీగా ఉంది. కానీ ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. సినిమా చూడాలనే ఆసక్తిని మాత్రం పెంచలేకపోయింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. దీన్ని భారీ స్థాయిలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.