Rashmika Mandanna Secret: కో యాక్టర్స్ కి నేషనల్‌ క్రష్‌ టార్చర్‌.. ఆవేశంలో ఓపెన్‌ అయిన రష్మిక.. హాట్‌ టాపిక్‌

Published : Mar 01, 2022, 07:44 PM ISTUpdated : Mar 01, 2022, 07:52 PM IST

రష్మిక మందన్నా ఇప్పుడు క్రష్మిక మందన్నాగా మారిపోయింది. నేషనల్‌ క్రష్‌ నుంచి ఆమె సింపుల్‌గా క్రష్మికగా టర్న్ తీసుకుంది. అయితే రష్మిక ఓ షాకింగ్‌ సీక్రెట్‌ని రివీల్‌ చేసింది. తాను కో యాక్టర్స్ ని టార్చర్‌ చేస్తానని చెప్పింది. 

PREV
18
Rashmika Mandanna Secret: కో యాక్టర్స్ కి నేషనల్‌ క్రష్‌ టార్చర్‌.. ఆవేశంలో ఓపెన్‌ అయిన రష్మిక.. హాట్‌ టాపిక్‌

హీరోయిన్‌గా అతి తక్కువ టైమ్‌లోనే విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది రష్మిక మందన్నా(Rashmika Mandanna). అంతేకాదు రెండు సినిమాలకే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో నటించిన రెండో సినిమానే ఆమెని స్టార్‌ హీరోయిన్‌ని చేసింది. ఆ వెంటనే నార్త్ లోకి అడుగుపెట్టి నేషనల్‌ క్రష్‌గా ఎదిగింది. కుర్రాళ్లకి డ్రీమ్‌ గర్ల్ గా మారిపోయింది. చలాకీతనం, కొంటెతనం, చిలిపితనం, అల్లరితనం కలగలిపిన రష్మిక మందన్నా తాను ఉన్న చోట సందడే సందడి అనేట్టుగా ఉంటుంది. 

28

కానీ సినిమాల్లో మాత్రం తాను వేరు అని చెబుతుంది. కొంటె, అల్లరి మాత్రమే కాదు తాను టార్చర్‌ అని చెబుతుంది. తాజాగా ఈ విషయాన్ని రష్మిక మందన్నా వెల్లడించింది. తాను కోస్టార్స్ కి టార్చర్‌ అని చెప్పేసింది. ఆవేశంలో అసలు సీక్రెట్‌ని బయటపెట్టిందని అంటున్నారు నెటిజన్లు. ఇంతకి రష్మిక ఏం చెప్పింది. ఎందుకు చెప్పిందనేది చూస్తే. 

38

రష్మిక ప్రస్తుతం తెలుగులో నటించిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రం ఈ నెల(మార్చి) 4న విడుదల కాబోతుంది. శర్వానంద్‌తో కలిసి నటించింది. ఖుష్బు, రాధికా, ఝాన్సీ, రాజ్యలక్ష్మి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మహిళా ప్రధానంగా సాగే చిత్రమిది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా రష్మిక మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొంది. అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

48

ఇలాంటి టైమ్‌లో లేడీ ప్రధానంగా రూపొందిన సినిమా చేయడం గర్వంగా ఉందని చెప్పింది. అదే సమయంలో విజయశాంతి, రాధిక, ఖుష్బు, ఊర్వశి వంటి సీనియర్‌ నటీమణులతో కలిసి నటించే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొంది రష్మిక. 

58

`ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో ఇతర లేడీస్‌తోపాటు మీరు కూడా శర్వానంద్‌ ఓ రేంజ్‌లో ఆడుకున్నట్టుందిగా అన్న ప్రశ్నకి స్పందిస్తూ, అవునని తెలిపింది. అయితే తాను బేసిక్‌ కో యాక్టర్స్ ని టార్చర్‌ చేస్తానని చెప్పేసింది(నవ్వుతూ). ఆ తర్వాత కవర్‌ చేస్తూ శర్వానంద్‌తో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ని పంచుకుంది. హీరో చుట్టూ ఆడవాళ్లే ఉంటారని, వాళ్లు ఇబ్బంది పెడుతుంటారని, అందులో తాను కీలకమని చెప్పింది.

68

 అయితే రష్మిక తన ప్రతి సినిమాలో కో యాక్టర్స్ ని టార్చర్‌ చేస్తుందా? లేక `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలోని కో యాక్టర్స్ ని టార్చర్‌ చేసిందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు హాట్‌ టాపిక్‌ అవుతుంది. అయితే శర్వానంద్‌పై ప్రశంసలు కురిపించిన రష్మిక.. ఆయన తన కోసం ఇంటి నుంచి ఫుడ్‌ కూడా తీసుకొచ్చేవారని వెల్లడించింది.

78

విజయ్‌ దేవరకొండతో పెళ్లిపై స్పందించిన రష్మిక పెళ్లి రూమర్స్ ని తాను ఎంజాయ్‌ చేశానని, టైమ్‌ పాస్‌గా భావించానని, రూమర్స్‌ని ఎంజాయ్‌ చేశానని తెలిపింది. తనకు ఇంకా పెళ్లి చేసుకునే వయసు రాలేదని, దానికి ఇంకా టైమ్‌ కావాలని తెలిపింది. అలాగే నటిగానూ తనకు అనేక డ్రీమ్‌ రోల్స్ ఉన్నాయని, బయోపిక్‌, యాక్షన్‌, హిస్టారికల్‌ ఇలా అనేక చిత్రాలు చేయాలని ఉందని చెప్పింది రష్మిక. 

88

అంతేకాదు తనకు హర్రర్‌ సినిమాలంటే బయమట. అలాంటి సినిమాలు చూడనని, అలాంటి సినిమాలు అస్సలు చేయనని తెలిపింది. ప్రస్తుతం హిందీలో `గుడ్‌ బై`, `మిషన్‌ మజ్ను`తోపాటు పలు భారీ ప్రాజెక్ట్ లకు చర్చలు జరుగుతున్నాయని, ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories