బ్లాక్‌ టాప్‌లో రష్మిక మందన్నా చిలిపి పోజులు.. క్యూట్‌నెస్‌కి పడిపోతున్న కుర్రాళ్లు

Published : Jul 25, 2022, 05:21 PM ISTUpdated : Jul 25, 2022, 06:32 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఆరబోతలో హద్దులు చెరిపేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. నేషనల్‌ వైడ్‌గా ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్న ఈ భామ లేటెస్ట్ గా హైదరాబాద్‌లో మెరిసింది. 

PREV
19
బ్లాక్‌ టాప్‌లో రష్మిక మందన్నా చిలిపి పోజులు.. క్యూట్‌నెస్‌కి పడిపోతున్న కుర్రాళ్లు

రష్మిక మందన్నా(Rashmika Mandanna) లేటెస్ట్ లుక్‌లో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. బ్లాక్‌ టాప్‌ ధరించి హాట్‌నెస్‌తోపాటు క్యూస్‌నెస్‌ని పెంచుకుంది. ఈ అమ్మడిని ఇలా చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్యూట్‌నెస్‌లో పడేస్తున్న రష్మిక అంటున్నారు. ఇటీవల కాలంలో రష్మిక గ్లామర్‌ డోస్‌పెంచుతున్న నేపథ్యంలో నయా లుక్‌ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

29

రష్మిక హీరోయిన్‌గా కాకుండా కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `సీతా రామం`. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా రూపొందిన చిత్రమిది. హనురాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాల్‌ ఠాక్యూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్ర ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్ ఈ ట్రైలర్‌ ఈవెంట్‌ ప్రెస్‌ మీట్‌ జరిగింది. 

39

ఇందులో రష్మిక మందన్న పాల్గొని ఆకట్టుకుంది. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ చిత్రంలో తన పాత్ర చాలా డిఫరెంట్‌గా, వైల్డ్ గా ఉంటుందని తెలిపింది. ఫస్ట్ టైమ్‌ తానొక భిన్నమైన పాత్రని పోషిస్తున్నట్టు పేర్కొంది రష్మిక. సినిమా కథని తానే చెబుతానని పేర్కొంది. సినిమాలోని అసలు కథని మలుపుతిప్పే పాత్ర తనదని పేర్కొంది. తనకిది డిఫరెంట్‌ ఎక్స్ పీరియెన్స్ నిస్తుందని చెప్పింది రష్మిక మందన్నా. 

49

నేషనల్‌ క్రష్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మిక మందన్నా బాలీవుడ్‌లో పాగావేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే మూడు భారీ సినిమాల్లో నటిస్తుంది. `మిషన్‌ మజ్ను`, `గుడ్‌బై` చిత్రాలతోపాటు రణ్‌ బీర్‌ కపూర్‌తో కలిసి `యానిమల్‌` సినిమా చేస్తుంది. ఈ సినిమాలు విజయాలు సాధిస్తే ఇక నార్త్ లోనూ తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. 

59

మరోవైపు రష్మిక మందన్నా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక చాలా మారిపోయింది. గ్లామర్‌ డోస్‌ పెంచుతూ కనిపిస్తుంది. నార్త్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఒక్కో డోస్‌ పెంచుతూ పోతుంది క్రష్మిక. అందాల ఆరబోతలో హిందీ భామలకు తక్కువ కాదని చాటుకుంటుంది. 

69

టాలెంటెడ్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న ఈ అందాల భామ హాట్‌ షోలోనూ తాను తక్కువ కాదని, కమర్షియల్‌ హీరోయిన్ అనేది నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంది. అవకాశాల వేటలో, క్రేజ్‌ని పెంచుకునే ప్రయత్నంలో, ఫాలోయింగ్‌ని పెంచుకునే లక్ష్యంతో రష్మిక అందాల విందు చేస్తుంది. 

79

రష్మిక మందన్నా ఇటీవల విడుదలైన `పుష్ప` చిత్రంతో పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఇండియా వైడ్‌గా శ్రీవల్లిగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఈ బ్యూటీని శ్రీవల్లి అని పిలవడం విశేషం. డీ గ్లామర్‌ లుక్‌లో, శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా యాక్ట్ చేసింది. పాత్రకి ప్రాణం పోసింది రష్మిక. 

89

ప్రస్తుతం ఈ భామ అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికల జాబితాలో చేరింది. అత్యంత క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. తెలుగులో ఇప్పుడు `పుష్ప 2`లో నటిస్తుంది. దీంతోపాటు `సీతా రామం` సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం ఆగస్ట్ 5న విడుదల కానుంది. 

99

మరోవైపు తమిళంలో విజయ్‌తో కలిసి `వారసుడు` సినిమా చేస్తుంది. కోలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా రాణించే ప్రయత్నం చేస్తుంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతోంది రష్మిక. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories