విజయ్ దేవరకొండతో లవ్ ట్రాక్ పై.. మరో సారి క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్నా

Published : Aug 05, 2022, 01:09 PM IST

టాలీవుడ్ లోకి వచ్చిన చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శాండిల్ వుడ్ భామ రష్మిక మందన్నా. ఛలో సినిమాతో ఎంటర్ అయ్యి.. గీతగోవిందం సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ..ఆతరువాత తిరగి చూసుకోలేదు. అయితే ఈసినిమా నుంచి విజయ్ దేవకొండతో రష్మిక లవ్ లో ఉందంటూ పుకార్లు వచ్చాయి. 

PREV
17
విజయ్ దేవరకొండతో లవ్ ట్రాక్ పై.. మరో సారి క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్నా

గీత గోవిందం తరువాత డియర్ కామ్రేడ్ సినిమాలో మరోసారి రష్మికతో రొమాన్స్ చేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో లిప్ లాక్ లతో తెగ సందడి చేశారు ఇద్దరూ. ఇక వీరు జంట అవ్వడం ఖాయం అనుకున్నారంతా.. ఆతరువాత ఎవరి సినిమాలు వారు చేస్తూన్నా.. డిన్నర్లంటూ కలవడం మొదలెట్టారు. 

27

విజయదేవర కొండతో కలిసి రెండు  సినిమాలు చేసినందకు...వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ.. నెట్టింట్లో పుకార్లు గట్టిగా షికారు చేస్తున్నాయి. ప్రేమలో ఉన్నారని, డేటింగ్‌ చేస్తున్నారని, రహస్యంగా పెళ్లి కూడా జరిగిపోయిందని.. ఇలా రకరకాల ప్రచారాలు  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 
 

37

అయితే ఈ విషయంలో  విజయ్‌ దేవరకొండ, రష్మిక ఇద్దరూ వివరణ ఇచ్చారు. తమ మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని, తమ ప్రేమ వార్తల్లో  నిజం లేదని స్పష్టం చేశారు. అయినా వీరి గురించి ఏదో విధంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి.  రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న విజయ్ దేవరకొండకు తన ప్రేమ విషయం గురించి ప్రశ్న ఎదురయ్యింది. కాని ఈ విషయం ఇప్పడే చెప్పను అని విజయ్ తేల్చేశారు. లవ్ లో ఉన్నానని మాత్రం హింట్ ఇచ్చాడు. 
 

47

దాంతో మొన్నటి వరకూ సైలెంట్ అయిపోయిన సోషల్ మీడియా జనాలు..  మరోసారి విజయ్ దేవరకొండ - రష్మిక ప్రేమ వ్యవహరం అంటూ ప్రచారం మొదలు పెట్టారు. రష్మికతో ప్రేమలో ఉన్నాడు.. అందుకే పబ్లిక్ గా ఒప్పుకోలేదంటున్నారు. అయితే మరోసారి ఈ విషయం ట్రెండ్ అవుతుండటంలో .. హీరోయిన్ రష్మిక మరోసారి స్పందించింది. 
 

57

రీసెంట్ గా రష్మిక మాట్లాడుతూ.. తానిప్పటికీ సింగిల్ గానే ఉన్నానని గట్టిగా  తెలిపింది.  తన దృష్టి అంతా  ప్రస్తుతం సినిమాల మీదే ఉంది అంటోంది.  టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నా.. రష్మిక..  బాలీవుడ్‌ లో సత్తా చాటాలని చూస్తోంది. అక్కడ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. 
 

67

అయితే ఈ బ్యూటీ  కోలీవుడ్‌లో సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంది. కార్తీకి జంటగా సుల్తాన్‌ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చినా, ఆ చిత్రంతో ఆశించిన క్రేజ్‌ను తెచ్చుకోలేక పోయింది. దీంతో తాజాగా విజయ్‌తో రొమాన్స్‌ చేస్తున్న వారీసు సినిమా పైనే రష్మిక భారీ ఆశలే పెట్టుకుంది.   
 

77

ఇక రష్మిక  పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా దేశ వ్యాప్తంగా హిట్ అవ్వడంతో.. తన బాలీవుడ్ ఆశలు చిగురించాయి.. ఇక పుష్ప2  తో మరోసారి పాన్ ఇడియాలో సందడి చేయబోతోంది రష్మిక. ఈ సారి ఇంకా అద్భుతంగా చేసి.. తన పేరును స్థిరం  చేసుకోవాలి అన ిచూస్తోంది.  

click me!

Recommended Stories