Guppedantha Manasu: వసుతో తీసుకున్న సెల్ఫీని రిషికి చూపించిన గౌతమ్.. వైరల్ గా మారిన ఫోటో?

Navya G   | Asianet News
Published : Jan 04, 2022, 11:15 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
17
Guppedantha Manasu: వసుతో తీసుకున్న సెల్ఫీని రిషికి చూపించిన గౌతమ్.. వైరల్ గా మారిన ఫోటో?

రిషి (Rishi) కారు కీ కాలేజ్ లో కిందపడుతుంది. అది గమనించిన వసు, రిషికి చెప్పడానికి ఎంత ట్రై చేసినా.. రిషి వినిపించుకోకుండా క్లాస్ లోకి వెళ్తాడు. ఆ తొందర్లో వసుధార కూడా క్లాస్ కి వెళుతుంది. వసు (Vasu) క్లాస్ లో ఆ కీ గురించి ఆలోచిస్తుండగా.. రిషి వసుని క్లాస్ వినడం ఇష్టం లేకపోతే క్లాస్ నుండి బయటకు వెళ్ళిపో అని వార్నింగ్ ఇస్తాడు.
 

27

వసుధార (Vasudhara) కీ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి  ఇదే మంచి అవకాశంగా భావించి క్లాస్ నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఇక కీ వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఈ క్రమంలో జగతి వసుధార దగ్గరికి వస్తుంది. ఎం వెతుకుతున్నావు అని అడగగా ఒకటి పోయింది మేడం అది వెతుకుతున్న అని సమాధానం ఇస్తుంది. దానికి జగతి (Jagathi) పోయినది ఎప్పటికీ తిరిగి దొరకదు అని చెప్పి వెళ్లిపోతుంది.
 

37

మొత్తానికి  వసు (Vasu) కీ ఎక్కడుందో కనిపెట్టేస్తుంది. ఆ తరువాత కాలేజీలో స్టాఫ్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్  ఆలోచన తట్టినందుకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ మీటింగ్ లో దాని గురించి వివరిస్తూ.. దానిని ఎలా నడపాలని చర్చలు చేస్తుంటారు.
 

47

ఇక కారు కీ పట్టుకొని వసుధార (Vasudhara) ఒకచోట కూర్చుని ఉంటుంది. రిషి బయటకు రావడంతో ఇవ్వడానికి వెళుతుంది. కానీ  అది పట్టించుకోకుండా క్లాస్ నుంచి ఎందుకు బయటకి వెళ్ళావ్ అని క్లాస్ పీకుతాడు. ఆ తర్వాత కారు కీ ఎక్కడుందని  ఆలోచిస్తాడు. ఈలోపు వసు కారు కీ తీసి ఇస్తుంది. జరిగిన సంగతి రిషి (Rishi) కి చెబుతుంది.
 

57

ఆ తరువాత గౌతమ్ (Gautham ),  వసుధార పనిచేసే రెస్టారెంట్ కు వెళ్లి కూర్చుంటాడు. ఈలోపు అక్కడికి రిషి కూడా వస్తాడు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు పక్క పక్కన కూర్చొని ఉంటారు. ఇక వసుధార రిషి (Rishi) దగ్గరికి వచ్చి ఆర్డర్ తీసుకుంటుంది.
 

67

మరోవైపు జగతి, మహేంద్రలు ఇద్దరు కలిసి రిషి  (Rishi) ప్రవర్తన గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత జగతి మహేంద్రను వసుధార (Vasudhara ) రూమ్ లోకి తీసుకుని వెళ్లి గిఫ్ట్ కార్డ్ టాగ్ ను చూపించి వసు, రిషి ల ఇద్దరి గురించి మాట్లాడుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తారు.
 

77

ఇక రెస్టారెంట్ లో గౌతమ్ (Gautham) వసు ఇంకా రాకపోయేసరికి వసుధార..  అని గట్టిగా అరుస్తాడు. ఈ లోపు రిషి గౌతమ్ ను చూస్తాడు. అలా ఒకరికి ఒకరు చూసుకుని షాక్ అవుతారు. ఆ తరువాత  గౌతమ్  సాహసంతో కూడిన సర్ప్రైజ్ అంటూ వసుతో దిగిన సెల్ఫీ రిషికి చూపిస్తే దానికి రిషి (Rishi)  షాక్ అవుతాడు.

click me!

Recommended Stories