విజయ్ తో ముద్దు వివాదం.. నయనతార తన భర్త విష్నేష్ ను అవమానించిందా..?

First Published | Aug 7, 2024, 12:34 PM IST

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ ను అవమానించిందా.. షూటింగ్ స్పాట్ లో.. ముద్దు వివాదం వారి మధ్య గోడవకు దారి తీసిందా..? 

కోలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్ లిస్ట్ లో  నయనతార తన రొమాంటిక్ హబ్బీ విఘ్నేష్ శివన్‌ కూడా ఉంటారు. 2022లో వీరు ప్రేమించి  పెళ్లి చేసుకున్నారు. ఈ జంట సుమారు 7 సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. ఆతరువాత ఒకరినొకరు అర్ధం చేసుకునిపెళ్ళి చేసుకున్నారు. 

గతంలో శింబు, ప్రభుదేవ తో లవ్ బ్రేకప్ వల్ల చాలా ఇబ్బందులు పడింది నయనతార. ఆతరువాత కోలుకుని.. విష్నేష్ ను ఇష్టపడింది. తనకంటే చాలా చిన్నవాడైన విఘ్నేష్ తో నానుమ్‌ రౌడీ థాన్‌.. సినిమా షూటింగ్ టైమ్ లో ప్రేమలో పడింది నయన్.  ఈసినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఇక ఈమూవీలో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. 
 


ఈసినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆ సినిమాలో పనిచేసిన రాధికకు మాత్రమే వీరి ప్రేమ వ్యవహారం తెలిసింది. అది కూడా మూవీ షూటింగ్  చివర్లో ఈ విషయాన్ని రాధిక కనిపెట్టిందట.  వీరి ప్రేమ వ్యవహారం వెలుగులోకి రావడంతో విక్కీ-నయన్ జంట అవార్డ్ ఫంక్షన్స్, ఫిల్మ్ ఫెస్టివల్స్ కు జంటగా హాజరవడం మొదలుపెట్టారు.
 

ముఖ్యంగా సైమా అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న నయనతార.. తన ప్రియుడు విఘ్నేష్ శివన్ నుంచి అవార్డు అందుకోవాలనుకుంటున్నానని  చెప్పడంతో.. అవార్డ్ ఇవ్వడానికి వచ్చిన అల్లు అర్జున్‌ ను అవమానించినంత పనిచేసింది నయన్. బన్నీ పక్కన ఉండగానే విక్కీ  చేతుల మీదుగా అవార్డు అందుకుంది బ్యూటీ. 
 

ఇక పెళ్ళికి ముందే సహజీవనం కూడా చేశారు నయన్ దంపతులు అంతే కాకుండా తరచూ దంపతులుగా విదేశాలకు వెళ్లేవారు. ఒకరినొకరు ప్రేమిస్తున్న విక్కీ, నయన్ మధ్య గొడవలు కూడా తప్పలేదు. వీరిద్దరికి మధ్య ఓ షూటింగ్ టైమ్ లో మనస్పర్ధలు వచ్చాయట. అది ఏదో కాదు.. వీరు ప్రేమలో పడ్డ నానుమ్ రౌడీదాన్ సినిమా టైమ్ లోనే ఇది జరిగిందట. 
 

naanum rowdy dhaan

ఈ సినిమా  షూటింగ్‌ టైమ్ లో  నయన్‌, విజయ్‌ సేతుపతిల మధ్య ప్రేమ చిగురించిన సీన్స్ తీసేప్పుడు.. నయన్ ఇబ్బంది పడిందట. డైరెక్ట్ చేసేది విఘ్యేష్ శివన్ కావడం.. వీరి మధ్య కాస్త రొమాంటిక్ సీన్స్ వచ్చేప్పుడు ఇంకాస్త డెప్త్ కావాలి.. అంటూ.. నయన్ ను ఎంకరేజ్ చేశారట. ముద్దు సీన్ అప్పుడు కూడా విక్కీ అలా చేసేసరికి.. నయన్ ఇబ్బందిపడి.. షూటింగ్ లోనే విక్కీపై అరిచిందట. 

సైకోలా చేస్తున్నావంటూ నయనతార తిట్టిందట. దాంతో సినిమా కోసం అలా చేయక తప్పలేదని విఘ్నేష్ ఆమెను బుజ్జగించారట. ఇలా వీరిద్దరిమధ్య లవ్ స్టార్ట్ అయినప్పుడు గొడవలు తప్పలేదు. ఇక ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలతో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇద్దరు. నయన్ నటిగా,,విఘ్నేష్ డైరెక్టర్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. 

Latest Videos

click me!