భాను అతైయా, సత్యజిత్ రే, ఏ.ఆర్. రెహమాన్ లాంటి లెజెండరీ ఆర్టిస్టులు ఆస్కార్స్‌లో ఇండియా తరపున సత్తా చాటారు. మ్యూజిక్, సౌండ్, కాస్ట్యూమ్ డిజైన్, డాక్యుమెంటరీ కేటగిరీల్లో అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు.
ఏ.ఆర్. రెహమాన్ (2009) - ఉత్తమ ఒరిజినల్ స్కోర్ & ఉత్తమ ఒరిజినల్ సాంగ్. స్లమ్‌డాగ్ మిలియనీర్‌కు రెండు ఆస్కార్‌లు గెలిచి రెహమాన్ చరిత్ర సృష్టించాడు.
27
సత్యజిత్ రే (1992) - గౌరవ అకాడమీ అవార్డు. సత్యజిత్ రే ప్రపంచ సినిమాకు చేసిన కృషికి గాను ఆస్కార్ అందుకున్నారు.
37
రెసూల్ పూకుట్టి (2009) - ఉత్తమ సౌండ్ మిక్సింగ్. స్లమ్‌డాగ్ మిలియనీర్‌కు రెసూల్ పూకుట్టి ఆస్కార్ గెలుచుకున్నారు.
47
గుల్జార్ (2009) - ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (లిరిసిస్ట్). గుల్జార్ జై హో పాటకి సాహిత్యం అందించారు. ఈ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
57
కార్తీకి గోన్సాల్వ్స్ & గునీత్ మోంగా (2023) - ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్. వీరి డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్‌లో గెలిచింది.
67
నాటు నాటు (2023) - ఉత్తమ ఒరిజినల్ సాంగ్. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకుంది.ఈ పాటకి సంగీతం అందించిన కీరవాణి, సాహిత్యం అందించిన చంద్రబోస్ కి ఆస్కార్ దక్కింది.
77
భాను అతైయా (1983) - ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్. గాంధీ సినిమాకు భాను అతైయా ఆస్కార్ గెలుచుకున్నారు.త్వరలో మార్చి 3న ఆస్కార్స్ 2025 వేడుక జరగనుంది.