ఈ మూవీలో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) జంటగా నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ‘లైగర్’ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్పోర్ట్స్ డ్రామాను చార్మీ కౌర్, పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. రమ్యక్రిష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు.