చాలా రోజుల తర్వాత కొంచెం కొత్తగా ట్రై చేసిన రష్మీ..పెళ్లి చేసుకో అంటూ నెటిజన్ల సలహా

Published : Mar 15, 2024, 03:59 PM IST

గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగని రష్మీ ఓవర్ డోస్ గా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. 

PREV
19
చాలా రోజుల తర్వాత కొంచెం కొత్తగా ట్రై చేసిన రష్మీ..పెళ్లి చేసుకో అంటూ నెటిజన్ల సలహా

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదంగా ఉండేది. 

29

రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరించడం తో ఆ విధమైన చర్చకి కారణం అయింది. 

 

39

బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో భాగంగా సుధీర్ , రష్మీ కి చాలా సార్లు పెళ్లి జరిగింది. అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరించారు. 

49

సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. జబర్దస్త్ నుంచి సుధీర్ తప్పుకోవడంతో రష్మీ ఒంటరైపోయింది అంటూ ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రష్మీ ఒంటరైపోయింది అంటూ ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది లాంటి వాళ్ళు సెటైర్లు వేయడం చూస్తున్నాం. 

59

ఇదంతా ఒకెత్తయితే.. ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. 

69

లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాత్మక  సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. 

79

గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగని రష్మీ ఓవర్ డోస్ గా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. 

89

అయితే రష్మీ ఎప్పుడూ ఒకే తరహా అవుట్ ఫిట్స్ , ఒకే తరహా స్టైల్ ఫాలో అవుతుంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది కొంతవరకు నిజమే. ఎందుకంటే రష్మీ సరికొత్త లుక్ లో ఎంతవరకు కనిపించలేదు. 

 

99

తాజాగా ఆమె డ్రెస్ గా ఉన్న స్కర్ట్ లో హొయలు పోతూ ఫోజులు ఇచ్చింది. ఫ్రంట్ సైడ్ కటింగ్ ఉన్న స్కర్ట్ లో రష్మీ ఇస్తున్న ఫోజులు అట్రాక్టివ్ గా అనిపిస్తున్నాయి. రష్మీ కొత్త లుక్ ని కొందరు అభినందిస్తున్నారు. మరొకొందరు నెటిజన్లు అయితే చిలిపిగా కామెంట్స్ పెట్టడం ఆపడం లేదు. ఏజ్ బార్ అయిపోతోంది.. త్వరగా పెళ్లి చేసుకో అని సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం రష్మీ వయసు 35 ఏళ్ళు. 

click me!

Recommended Stories