Niharika Konidela: దాని కోసమైనా రెండో పెళ్లి చేసుకుంటా... మొహమాటం లేకుండా చెప్పేసిన మెగా డాటర్!

Published : Mar 15, 2024, 03:55 PM ISTUpdated : Mar 15, 2024, 04:03 PM IST

విడాకులు తీసుకున్న నిహారిక ఒంటరిగా ఉంటుంది. కాగా రెండో వివాహం చేసుకుంటాను అంటున్న నిహారిక మొహమాటం లేకుండా ఓపెన్ అయ్యింది.   

PREV
17
Niharika Konidela: దాని కోసమైనా రెండో పెళ్లి చేసుకుంటా... మొహమాటం లేకుండా చెప్పేసిన మెగా డాటర్!
Niharika Konidela

మెగా ఫ్యామిలీ లో రెబల్ గర్ల్ అంటే నిహారికనే. ఎందరు అడ్డుకున్నా హీరోయిన్ కావాలన్న తన కల నెరవేర్చుకుంది. మెగా ఫ్యామిలీ నుండి దాదాపు పది మంది హీరోలు ఉన్నారు. హీరోయిన్ మాత్రం ఒక్క నిహారికనే. 

27

ఒక మనసు చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఎమోషనల్ లవ్ డ్రామాగా ఒక మనసు తెరకెక్కింది. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ చనిపోతుంది. ట్రాజిక్ ఎండింగ్స్ నచ్చని తెలుగు ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోలేదు. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో నటించింది. అవి కూడా నిరాశపరిచాయి. 

 

37
Niharika Konidela

హీరోయిన్ గా బ్రేక్ రాకపోవడంతో పెద్దలు పెళ్లి చేశారు. గుంటూరుకు చెందిన వెంకట నాగ చైతన్యతో నిహారికకు 2020లో వివాహం జరిగింది. రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలస్ వీరి పెళ్ళికి వేదిక అయ్యింది. ఘనంగా పెళ్లి చేసుకున్న నిహారిక రెండేళ్లకే భర్తతో విడిపోయింది. 

47
Niharika Konidela

2023 ప్రారంభంలో అధికారికంగా విడాకులు ప్రకటించారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు నేపథ్యంలో విడిపోయారు. భర్తతో విడిపోయాక నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తుంది. అలాగే నిర్మాతగా రాణించాలి అనుకుంటుంది. 

57

మరి నిహారిక రెండో వివాహం చేసుకుంటుందా లేదా? అనే సందేహాలు ఉన్నాయి. దీనిపై నిహారిక స్వయంగా క్లారిటీ ఇచ్చింది. విడాకులు అయినంత మాత్రాన మరొకరిని ఇష్టపడం జరగదు అని నేను అనుకోను. ఒక రిలేషన్ ఫెయిల్ కావడానికి పలు రీజన్స్ ఉంటాయి. కొన్ని కారణాల వలన నాకు మ్యారేజ్ వర్కవుట్ కాలేదు. 

 

67

నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. తల్లిని కావాలని కోరుకుంటాను. పిల్లల కోసం పెళ్లి చేసుకోక తప్పదు. కాబట్టి రెండో వివాహం తప్పకుండా చేసుకుంటాను. అది ఎప్పుడు అనేది చెప్పలేను... అని నిహారిక అన్నారు. కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఆలోచన తనకు ఉందని నిహారిక క్లారిటీ ఇచ్చింది. 

77


నిహారిక ఇటీవల ఓ తమిళ చిత్రానికి సైన్ చేసింది. అలాగే ఆహా యాప్ లో చెఫ్ మంత్ర సీజన్ 3 హోస్ట్ చేస్తుంది. ఆఫీస్ ఓపెన్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నారు. నిహారిక దృష్టి మొత్తం కెరీర్ మీదే ఉంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories