అంతేకాదు మరోసారి కూడా ప్రదీప్ పేరే చెప్పింది రష్మి. సుధీర్, ప్రదీప్, హైపర్ ఆదిలో బెస్ట్ ఎంటర్‌టైనర్ ఎవరు అనగా, ప్రదీప్ అని, ఆయన ముసలి వాళ్లని, చిన్న పిల్లలతో సహా ఎవరినైనా నవ్వించగలడు, అలరించగలడు అని తెలిపింది రష్మి. ఇక ముద్దు, చెంప్పదెబ్బ, హెచ్చరిక ఎవరికి ఇస్తారని అడగ్గా, ఆది విసిగిస్తాడు కాబట్టి చెంపదెబ్బ, సుధీర్‌కి వార్నింగ్ ఇస్తానని, ప్రదీప్‌కి మాత్రం కిస్ ఇస్తానని చెప్పి మరోసారి షాకిచ్చింది రష్మి. అంతేకాదు, పార్టీ, ట్రావెల్, షాపింగ్ ఎవరితో చేస్తారని అడగ్గా, సిద్దు జొన్నలగడ్డతో పార్టీకి వెళ్తానని, సుధీర్‌తో షాపింగ్ వెళ్తానని, ప్రదీప్‌తో ట్రావెల్ చేస్తానని వెల్లడించి ఆశ్చర్యపరిచింది.